Ram Gopal Varma: చికోటితో చర్చలు అందుకేనా.. ఆర్జీవికి అదిరిపోయే స్టోరీ దొరికేసిందా..?

|

Nov 02, 2022 | 7:44 PM

ఇక బయోపిక్ లు తీయడంలో వర్మ స్టైలే వేరు.వివాదాన్ని విడమర్చి తన సినిమాలో చూపిస్తూ ఉంటారు ఆర్జీవీ. ఇప్పటికే చాలా సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు మరో సినిమా  చేయనున్నారు.

Ram Gopal Varma: చికోటితో చర్చలు అందుకేనా.. ఆర్జీవికి అదిరిపోయే స్టోరీ దొరికేసిందా..?
Rgv
Follow us on

వివాదాలతోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది రామ్ గోపాల్ వర్మ అనే చెప్పాలి. ఆయన తీసే సినిమాలు వివాదాలతోనే కావాల్సినంత బజ్ తెచుకుంటాయి. ఇక బయోపిక్ లు తీయడంలో వర్మ స్టైలే వేరు. వివాదాన్ని విడమర్చి తన సినిమాలో చూపిస్తూ ఉంటారు ఆర్జీవీ. ఇప్పటికే చాలా సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు మరో సినిమా  చేయనున్నారు. ఇటీవలే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన వర్మ.. త్వరలోనే ఓ బయోపిక్ తీయనున్నాని.. అది రియల్ పిక్ అని సంచలనానికి తెరతీశారు.ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు ఆర్జీవీ. తాజాగా వర్మ చిక్కొటి ప్రవీణ్ ను కలిశారు. ఇప్పుడు ఇదే టాపిక్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. చిక్కొటి ప్రవీణ్ ఫామ్ హౌస్ లో ఇతర దేశాలకు చెందిన పలు జంతువులు ఉన్నాయి. ఆ  జంతువులను ఆసక్తిగా తిలకించారు వర్మ.

ఆ తర్వాత చిక్కొటి ప్రవీణ్ తో కలిసి పలు విషయాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ను ఆర్జీవీ స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాంతో ఆర్జీవీ చిక్కొటి ప్రవీణ్ కథతో సినిమా చేస్తారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.చికోటి ప్రవీణ్ కు రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రటీలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఆయన నుంచి కీలక సమాచారం సేకరించారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

రాంగోపాల్ వర్మ త్వరలోనే చికోటి ప్రవీణ్ పై సినిమా తీయాలని చూస్తున్నారని, ఇందులో భాగంగానే ఆర్జీవీ ఆయనను కలిసి చర్చించినట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి