
త్వరలో ప్రారంభంకానున్న బిగ్ బాస్ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 9 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో ఇప్పుడు సీజన్ 10 రెడీ అయ్యింది. గత సీజన్స్ కు మించి ఈ సీజన్ 10 ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఇప్పటికే బిగ్ బాస్ 10తో పాటు అగ్నిపరీక్ష 2 కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు. సెలబ్రెటీలతో పాటు సామాన్యులు కూడా ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. సీజన్ 9లో చాలా సామాన్యులకు కూడా పెద్ద పీట వేశారు. అగ్నిపరీక్ష ద్వారా కామన్ పీపుల్ ను సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపించారు. ఈసారి కూడా హౌస్ లోకి కామన్ పీపుల్ ను అగ్నిపరీక్ష ద్వారా ఫిల్టర్ చేసి హౌస్ లోకి పంపనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సీజన్ 10 పై ఉత్కంఠ మొదలైంది.
ఈసారి హౌస్ లోకి ఎవరు ఎవరు వెళ్లనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళేది వీరే అని కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి చాలా మంది తెలిసిన మొఖాలే వెళ్తున్నాయని తెలుస్తుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్ల ప్రకారం.
ఎక్స్ ప్రెస్ హరి, తేజస్విని, మంగ్లీ, యాంకర్ నిఖిల్, ఇన్‌ఫ్లూయెన్సర్ నందు, రమణ, నటుడు ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు వంటి వారు రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. వీరితో పాటు ఓ నటి కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఆమె క్రేజీ నటి. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించింది. నెట్టింట ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకుంది. ఆమె ఎవరో కాదు నటి సోనియా సింగ్. సోనియా సింగ్ చాలా మంది తెలిసిన పేరే.. ఈ అమ్మడు చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. తన ప్రియుడు సిద్దూతో కలిసి ఆమె చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. అలాగే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లోనూ నటించింది. ఇటీవలే నాగబంధం సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ 10లోకి అడుగుపెట్టనుంది టాక్ వినిపిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి