
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) హఠాన్మరణం చెందారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతోన్న రావత్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (ఆగస్టు 04) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించిన ప్రదీప్ రావత్ 1985 నుంచి యాక్టింగ్ మొదలు పెట్టారు. సినిమాల్లోకి రాకముందు ఆయన కొన్ని సీరియల్స్ లో నటించారు. ముఖ్యంగా బీఆర్ చోప్రా తెరకెక్కించిన మహా భారత్ టీవీ సిరీస్ లో రావత్ పోషించిన అశ్వత్థామ పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఆమిర్ ఖాన్ నటించిన క్ బస్టర్ మూవీ లగాన్ లోనూ ఓ కీలక పాత్ర పోషించారీ నటుడు. 2004లో రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ప్రదీప్. ఇందులో అతను పోషించిన భిక్షు యాదవ్ పాత్ర బాగా హైలెట్ అయ్యింది. నిజం చెప్పాలంటే సై సినిమాతో హీరోల కంటే విలన్ గా నటించిన రావత్ కే మంచి పేరు వచ్చింది. సై తర్వాత ప్రదీప్ తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా అవకాశాలొచ్చాయి. భద్ర, అందరివాడు, ఛత్రపతి, లక్ష్మీ,స్టాలిన్, దేశముదురు, యోగి, గజినీ, మస్కా, రగడ, రాజన్న, రెబెల్, నాయక్, నేనొక్కడినే, లయన్, సరైనోడు, నేను శైలజ, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమ రాయుడు, నేనే రాజు నేనే మంత్రి, జై లవకుశ, ఆడాళ్లు మీకు జోహార్లు, వాల్తేర్ వీరయ్య.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రావత్. కేవలం విలన్ గానే కాకుండా ఓయ్, పూలరంగడు, నేను శైలజా, సరైనోడు వాల్తేర్ వీరయ్య తదితర సినిమాల్లో కామెడీని కూడా అద్బుతంగా పండించారు ప్రదీప్.
సినిమాల సంగతి తప్పితే ప్రదీప్ రావత్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు… ఈ నటుడి భార్య పేరు కల్యాణి. పేరు చూస్తే తెలుగమ్మాయిలా ఉంది అనుకుంటున్నారా? అవును.. ఈ ప్రదీప్ రావత్ భార్య తెలుగమ్మాయే. ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే ఈ విషయాన్ని పంచుకున్నాడు. కాగా రావత్ ఫేమస్ నటుడు అయినప్పటికీ ఆయన ఫ్యామిలీ మాత్రం లో ఫ్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది. అందుకే ప్రదీప్ రావత్ ఫ్యామిలీ బయట ఎక్కడా కనిపించదు. అప్పుడప్పుడు మాత్రమే కొన్ని ఈవెంట్లలో కనిపిస్తుంటుంది. ఈ దంపతులకు విక్రమ్ రావత్, సింగ్ రావత్ అనే ఇద్దరు సంతానం. . సినిమాల్లో విలన్ పాత్రల్లో క్రూరంగా కనిపించే ప్రదీప్ రావత్.. ఇంట్లో మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటారని ఆయన భార్య ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆయన చాలా సున్నితమైన మనసు కలవారని కల్యాణి పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.