Dhurandhar 2: ‘ధురంధర్ 2’ డైరెక్టర్ భార్య తెలుగులో ఫేమస్ హీరోయిన్ అని తెలుసా? వీరి లవ్ స్టోరీ మూములుగా లేదుగా

ప్రస్తుతం ఎక్కడ చూసినా ధురంధర్ 2 సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఉగాది కానుకగా ఇవాళ (మార్చి 19) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మొదటి భాగానికి మించి ఉందంటూ రివ్యూలు వస్తున్నాయి.

Dhurandhar 2: ధురంధర్ 2 డైరెక్టర్ భార్య తెలుగులో ఫేమస్ హీరోయిన్ అని తెలుసా? వీరి లవ్ స్టోరీ మూములుగా లేదుగా
Dhurandhar The Revenge

Updated on: Mar 19, 2026 | 8:58 AM

ఆదిత్య ధర్.. కొన్ని నెలల క్రితం వరకు ఈ పేరు గురించి చాలా మందికి తెలియదు. అయితే ఎప్పుడైతే ధురంధర్ సినిమా రిలీజైందో ఇతని పేరు మార్మోగిపోయింది. 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ధురంధర్ నిలిచింది. దీంతో ఒక్కసారిగా ఆదిత్య ధర్ పేరు తెగ మార్మోగిపోయింది. సుమారు ఆరేళ్ల క్రితమే అంటే 2019లో ఉరి అనే ఓ సినిమాను తీశాడు ఆదిత్య. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తీసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. అయితే మొదటి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు ఆదిత్య ధర్. ఈ మధ్యకాలంలో రచయితగా తన ప్రతిభను చాటుకున్నాడు. ఆర్టికల్ 370, ధూమ్ ధామ్, బారాముల్లా వంటి బ్లాక్ బస్టర్స్ మూవీకి స్క్రీన్ రైటర్ గా వ్యవహరించాడు ఆదిత్య. ఇక గతేడాది ధురంధర్ తో బాక్సాఫీస్ ను షేక్ చేశాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఈ సినిమా ఏకంగా రూ. 1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తద్వారా భారతీయ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-3 సినిమాల్లో ఒకటిగా ధురందర్ నిలిచింది. ఇక లేటెస్ట్ గా ధురంధర్ ది రివేంజ్ అంటూ మరోసారి మన ముందుకు వచ్చాడు ఆదిత్య. కేవలం 3 నెలల గ్యాప్ లోనే సీక్వెల్ ను రిలీజ్ చేసిన అతను ఇండస్ట్రీలోన టాప్ దర్శకులను సైతం ఆశ్చర్యపరిచాడు.

ఉగాది కానుకగా రిలీజైన ధురందర్ 2 మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సుమారు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఇంటెన్స్ డ్రామాతో మూవీ ఉందని రివ్యూలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిత్య ధర్ పేరు మరోసారి నెట్టింట మార్మోగిపోతోంది. అతని గురించి పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ భార్య కూడా ఫేమస్ హీరోయిన్. బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోన్న ఈ ముద్దుగుమ్మ గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆమె మరెవరో కాదు.. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న యామీ గౌతమ్.

ఇవి కూడా చదవండి

భార్య యామీ గౌతమ్ తో ధురంధర్  2 డైరెక్టర్..

నువ్విలా, కొరియర్ బాయ్ కల్యాణ్, గౌరవం, యుద్ధం సినిమాల్లో కథానాయికగా చేసింది ఆదిత్య దర్. అయితే 2015 తర్వాత కేవలం బాలీవుడ్ కే పరిమితమైందీ అందాల తార. ఇక ఆదిత్య ధర్ తెరకెక్కించిన మొదటి సినిమా ఉరిలో యామీ గౌతమ్ కథానాయికగా నటించింది . అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట 2021 జూన్ లో పెద్దల అనుమతితో ఇద్దరూ పెళ్లిపీటలెక్కారు. 2024లో ఈ దంపతులకు వేదవిద్ ధార్ అనే అబ్బాయి పుట్టాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us