Vijay’s Beast : బీస్ట్ సినిమాకు బెస్ట్ బిజినెస్.. భారీ ధరకు అమ్ముడు పోయిన దళపతి విజయ్ సినిమా ఓటీటీ రైట్స్

దళపతి విజయ్ సినిమా అంటే అభిమానులకు పండగే అని చెప్పాలి. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. వరుసగా భారీ విజయాలను అందుకుంటున్నాడు..

Vijays Beast : బీస్ట్ సినిమాకు బెస్ట్ బిజినెస్.. భారీ ధరకు అమ్ముడు పోయిన దళపతి విజయ్ సినిమా ఓటీటీ రైట్స్
Vijay

Updated on: Aug 15, 2021 | 7:16 AM

Vijay’s ‘Beast’ : దళపతి విజయ్ సినిమా అంటే అభిమానులకు పండగే అని చెప్పాలి. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. వరుసగా భారీ విజయాలను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు బీస్ట్‌‌‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుందని తెలుస్తోంది. ఈ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెల చివరి వరకు లేదా వచ్చే నెలలో షూటింగ్‌‌‌కు గుమ్మడికాయ కొట్టనుంది చిత్రయూనిట్. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌‌‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ ను పూర్తిచేస్తూనే మరో వైపు బీస్ట్ సినిమాకు సంబంధించిన బిజినెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని ఆ మధ్య వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. కానీ ఈ సినిమా ఎట్టిపరిస్థితుల్లో థియేటర్స్ లోనే విడుదల చేస్తామని మేకర్స్ చెప్తూ వస్తున్నారు.

ఇక విజయ్ నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఈ క్రమంలోనే అందుకే బీస్ట్ సినిమాకుగాను అన్ని విధాలుగా బెస్ట్ బిజినెస్ అవుతోందని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వారు భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేశారని తెలుస్తోంది. విజయ్ మునుపెన్నడూ కనిపించని పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. బీస్ట్ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. తెలుగు డబ్బింగ్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్మడు పోయిందని సమాచారం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Devarakonda: ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముక ప్రియకు బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఆనందంతో గంతులేసిన సింగర్..

Meera Mithun: పోలీసులకు చుక్కలు చూపించిన మీరా మిథున్.. టచ్ చేస్తే ఆత్యహత్య చేసుకుంటా.. వీడియో వైరల్..

Paagal Movie Review: అమ్మలాంటి ప్రేమ కోసం ‘పాగల్‌’ పాట్లు.. ఇంతకీ లవ్‏లో పాసవుతాడా!

Akkineni Sumanth: విడాకులు తీసుకున్న మోస్ట్ కన్ఫ్యూజ్డ్ మెన్.. మళ్లీ మొదలైందంటున్న సుమంత్.

 

Loading...
Unable to load recommendations.
Follow Us