
విక్టరీ వెంకటేశ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలతో మెప్పిస్తున్నాడు. అయితే వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఈ మూవీకి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా ప్రపంచంలో వచ్చిన ది బెస్ట్ ఫ్యామిలీ డ్రామాలలో ఇది ఒకటి. ఈ చిత్రంలో వెంకటేశ్, సౌందర్య జంటగా నటించగా.. వినీత కీలకపాత్ర పోషించింది. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు ముఖ్య పాత్రలు పోషించారు. ఇద్దరు భార్య మధ్య సతమతమయ్యే భర్త పాత్రలో వెంకీ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ చిత్రం 1996లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా వస్తుందంటే ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.
ఎక్కువ మంది చదివినవి : Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ఈ సినిమాలో వెంకీ, సౌందర్య, బ్రహ్మనందం కామెడీ నెక్ట్స్ లెవల్. ముఖ్యంగా వెంకటేశ్, బ్రహ్మానందం కాంబోలో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా పూర్తిగా ఎలాంటి యాక్షన్ పైట్ సీన్స్ లేకుండా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సరదాగా సాగిపోతుంటుంది. అందుకే ఈ చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో మరో స్పెషల్ హైలెట్ రోల్ అంటే వెంకీ కొడుకు పాత్ర. ఈ చిత్రంలో వెంకీ, బ్రహ్మానందం పాత్రలతోపాటు ఈ చిన్నోడి కామెడీ కూడా హైలెట్ అనే చెప్పాలి.
ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..
క్యూట్ లుక్స్‌తో, చిట్టి పొట్టి మాటలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ కుర్రాడి పేరు నాగ అన్వేష్. ఈ సినిమాతో తెలుగులో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఈ కుర్రాడు తెలుగులో హీరో అన్న సంగతి తెలుసా.. ? 2017లో ఏంజెల్ అఏనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో హెబ్బా పటేల్ కథానాయికగా నటించింది. అ తర్వాత వినవయ్యా రామయ్య అనే చిత్రంలోనూ నటించాడు. ఈ రెండు సినిమాలు నాగ అన్వేష్ కు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
ఎక్కువ మంది చదివినవి : Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..
Naga Anvesh
ఎక్కువ మంది చదివినవి : Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..