Actress Urvashi: సీనియర్ హీరోయిన్ ఊర్వశి కూతురిని చూశారా? అందంలో అమ్మను మించి.. త్వరలోనే హీరోయిన్‌గా!

|

Oct 26, 2024 | 3:21 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన రుస్తుం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఊర్వశి. అంతకు ముందు ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత అంతిమ తీర్పు, చెట్టుకింద ప్లీడర్, పాడుతా తీయగా, విజయ రామరాజు, సందడే సందడి, అల్లరి రాముడు తదితర సినిమాల్లో నటిగా మెరిసింది.

Actress Urvashi: సీనియర్ హీరోయిన్ ఊర్వశి కూతురిని చూశారా? అందంలో అమ్మను మించి.. త్వరలోనే హీరోయిన్‌గా!
Actress Urvashi Family
Follow us on

సీనియర్ హీరోయిన్ ఊర్వశి.. ఇప్పటి తకం ప్రేక్షకులకు ఈ పేరు అంతగా తెలియకపోవచ్చు.. కానీ ఆమె తెరపై కనిపిస్తే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు ఊర్వశి. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో కలిసి నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 700 సినిమాల్లో నటించారు ఊర్వశి. ఇప్పుడు కూడా తల్లి, అత్త, పిన్ని వంటి సహాయక పాత్రలతో ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. సమంత నటించిన ఓ బేబీ సినిమాలో నవ్వులు పూయించారు ఊర్వశి. అలాగే శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలోనూ ఒక కీలకపాత్ర పోషించారు. అలాగే అన్నీ మంచి శకునములే, ఉళుజుక్కు (మలయాళం) సినిమాలు ఇటీవల ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు ఊర్వశి. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఊర్వశి వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. ఊర్వశి 2000లో మలయాళ నటుడు మనోజ్ జైన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు తేజ లక్ష్మి జన్మించింది. అయితే ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో ఊర్వశి, మనోజ్ విడాకులు తీసుకున్నారు.

ఇక ఊర్వశి కూతురు తేజ లక్ష్మి విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో కుంజతగా కనిపిస్తుంటుంది. అచ్చం ఊర్వశిలాఉండే కుంజత మోడ్రన్ లుక్‌లో సామాజిక మాధ్యమాల్లో తరుచుగా కనిపిస్తుంటుంది. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ తన కూతురు తేజ లక్ష్మి కూడా త్వరలోనే సినిమా అడుగుపెట్టనుందని తెలిపింది. అయితే కుంజత్త ఇప్పుడు అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తుంది.

కూతురితో ఊర్వశి..

 

హీరోయిన్ మెటీరియలే అయినప్పటికీ వెరైటీగా కిక్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటోంది. ఈ మధ్యన కుంజత్త ట్రైనింగ్ తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మరి భవిష్యత్‌లో నైనా ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.

కుటుంబ సభ్యులతో నటి ఊర్వశి..

కుమారుడు, కూతురితో నటి ఊర్వశి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.