
యంగ్ సెన్సేషన్ శ్రీలీల హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్స్ మాత్రం అందుకోలేకపోతుంది. పెళ్లి సందడి సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఆమె.. ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతోపాటు ఎనర్జీటిక్ డ్యాన్స్ తో ఆకట్టుకుంది. దీంతో తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. ఓవైపు స్టార్ హీరోలకు జోడిగా నటిస్తూనే.. మరోవైపు కుర్రహీరోలస సరసన నటించింది. అయితే కొన్నాళ్లుగా ఈ బ్యూటీ నటించిన చిత్రాలు తెలుగులో ప్లాప్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. అయితే వరుసగా ప్లాపులు వస్తున్నప్పటికీ శ్రీలీల డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ సినిమాలు చేస్తుంది. ఇటీవలే పరాశక్తి సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.
తెలుగులో ఈ అమ్మడు ఇప్పటివరకు పది సినిమాల్లో నటించింది. వాటిలో హిట్ అయినవి రెండే రెండు సినిమాలు అందులో ఒకటి ధమాకా అయితే మరొకటి భగవంత్ కేసరి సినిమా.. అయితే భగవంత్ కేసరి సినిమా బాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం శ్రీలీల అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
ప్రస్తుతం హిందీలో కార్తిక్ ఆర్యన్ సరసన ఓ లవ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ సినిమా గురించి ఇప్పటివరకు బాలీవుడ్ లో చాలా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఎలాంటి న్యూస్ రావడంలేదు. సినిమా గురించిన ఎలాంటి అప్డేట్స్ లేవు. దాంతో ఈ సినిమా ఆగిపోయిందా అని అనుమానాలు బీటౌన్ లో మొదలయ్యాయి. దాంతో ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ బాలీవుడ్ లో వైరల్ అవుతుంది. ముంబైలో జరుగుతున్న కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అయిందని టాక్. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.