Harish Shankar : బావా.. నీ కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ వర్క్‌.. భీమ్లానాయక్ సినిమా పై హరీష్ శంకర్ ట్వీట్..

|

Feb 25, 2022 | 5:41 PM

భీమ్లానాయక్ సినిమా... సీనీ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. మోస్ట్ అవేటెడ్‌ పవన్‌ ఫిల్మ్ గా రిలీజైన ఈ సినిమా తాజాగా రికార్డు బద్దలు కొట్టే దిశగా నడుస్తోంది.

Harish Shankar : బావా.. నీ కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ వర్క్‌.. భీమ్లానాయక్ సినిమా పై హరీష్ శంకర్ ట్వీట్..
Bheemla Nayak
Follow us on

Harish Shankar : భీమ్లానాయక్ సినిమా.. సీనీ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. మోస్ట్ అవేటెడ్‌ పవన్‌ ఫిల్మ్ గా రిలీజైన ఈ సినిమా తాజాగా రికార్డు బద్దలు కొట్టే దిశగా నడుస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ.. పవన్‌ స్టామినా ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేస్తోంది. మొదటి షోనుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక భీమ్లానాయక్ సినిమా చూసిన పవన్ అభిమానులు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు.  పవన్‌ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో టాలీసెలబ్రిటీలు భీమ్లానాయక్‌ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.  సినిమా పై తమ టాక్‌ను.. సినిమా చూస్తూ వాళ్లు పొందిన ఫీలింగ్‌  ట్వీట్లలో కోట్‌ చేస్తూ సినిమాపై మరింత హైప్‌ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్‌ ఫ్యాన్ అండ్ గబ్బర్‌ సింగ్ డైరెక్టర్‌ హరీష్ శంకర్ ఈ సినిమా పై ట్వీట్ చేశాడు.

‘భీమ్లా నాయక్‌ పాత్రలో పవన్‌కల్యాణ్‌ సింహల గర్జించారని అన్నారు.  చాలా రోజు తర్వాత థియేటర్‌లలో ఆయన నట గర్జన చూడటం అద్భుతంగా ఉందని పొగడ్తలతో ముంచెత్తారు. దర్శకుడు సాగర్‌ కె.చంద్ర, త్రివిక్రమ్‌, నాగవంశీలతో పాటు మొత్తం టీమ్‌కు నా అభినందనలు. తమన్ అందించిన మ్యూజిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బావా… నీ కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ వర్క్‌. ఇది బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ ఆఫ్‌ భీమ్లా..! నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది బావా..! రానా.. నీలో నేను కేవలం డేనియల్‌ శేఖర్‌ని మాత్రమే చూశా. నువ్వు అదరగొట్టేశావు’ అంటూ ట్వీట్‌ చేశారు. హరీష్ శంకర్ ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. హరీష్ శంకర్ ట్వీట్ పై పవన్ ఫ్యాన్స్ రీ ట్వీట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss OTT Telugu: ‏బిగ్‏బాస్ కొత్తింటిని చూపించిన నాగార్జున.. ఇక గ్యాప్ లేకుండా చూసేయండి అంటూ ప్రోమో రిలీజ్..

Poonam Kaur: పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్.. స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ రివ్యూ చెప్పేసిందిగా..

Bheemla Nayak: ఈ టికెట్ ధరలకు మేము సినిమాను ప్రదర్శించలేమంటూ థియేటర్స్ క్లోజ్… ఎక్కడంటే..