AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor: మోసపోయినా మంచి మనసు చాటుకున్న హీరో.. సాయం అడిగిన నెటిజన్‌కు వెంటనే డబ్బులు పంపి..

ఈ మధ్యన తమ పేరెంట్స్ కు ఆరోగ్యం బాగో లేదని, కుటుంబీకులు ఆస్పత్రిలో ఉన్నారంటూ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి డబ్బులు లాగుతున్నారు. వీరిని నమ్మి డబ్బులు పంపి మోసపోయిన వారిలో సామాన్యులే కాదు హీరోలు, హీరోయిన్లు కూడా ఉన్నారు.

Actor: మోసపోయినా మంచి మనసు చాటుకున్న హీరో.. సాయం అడిగిన నెటిజన్‌కు వెంటనే డబ్బులు పంపి..
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jun 16, 2026 | 8:19 PM

Share

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో జీవీ ప్రకాశ్ కుమార్ ఒకరు. రెహమాన్ మేనల్లుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన హీరోగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు. తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. సినిమాలు, సంగీతం సంగతి పక్కన పెడితే.. ఈ హీరోకు సామాజిక స్పృహ ఎక్కువ. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే ఆపన్నహస్తం అందిస్తాడు.అలా గతంలో చాలా మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు జీవీ. అయితే ఇదే అదనుగా తీసుకుని గతంలో కొందరు ఈ హీరోను బురిడీ కొట్టించారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టి జీవీ దగ్గర డబ్బులు తీసుకున్నారు. అయితే ఇవేవీ మనసులో పెట్టుకోని ఈ రియల్ హీరో మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. సోషల్ మీడియా వేదికగా సాయం అడిగిన ఓ నెటిజన్ కు వెంటనే డబ్బులు పంపి మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తన కుటుంబంలో ఒకరికి సర్జరీ ఉందని, డబ్బులు కావాలని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు జీవీ ప్రకాశ్ సాయం కోరుతూ ఆయనను ట్యాగ్ చేవారు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ప్రకాశ్ కుమార్ ఈ పోస్ట్ చూసి వెంటనే రూ. 50 వేలు పంపి రిప్లై కూడా ఇచ్చారు. దీంతో ఈ ట్యాలెంటెడ్ హీరోపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. గతంలో ఇలాగే మోసపోయినా మనసులో పెట్టుకోకుండా మంచి పని చేసిన జీవీ ప్రకాశ్ కుమార్ ను అందరూ అభినందిస్తున్నారు.

గతంలో ఏం జరిగిందంటే?

గతేడాది @prasannasathis అనే ప్రొఫైల్ పేరుతో ఒక గుర్తు తెలియని ఒక పోస్ట్ పెట్టాడు. చాలా కాలం క్రితం మరణించిన ఒక వృద్ధ మహిళ ఫొటోను పోస్ట్ చేసి, ఆమె తన తల్లి అని అబద్ధం చెప్పాడు. అంతేకాదు ఆమె అంత్యక్రియలను పూర్తి చేయడానికి డబ్బులు కావాలని జీవీ ప్రకాష్‌ను కోరాడు. ఆ వ్యక్తి చెప్పిన కట్టు కథకు ఈ హీరో చలించిపోయాడు. సదరు వ్యక్తికి వెంటనే రూ. 20 వేలు గూగుల్‌ పే చేశారు. అయితే కొద్ది సేపటికే సదరు వ్యక్తి ఛీట్ చేశాడని తెలిసిపోయింది. ఒక ఫేక్‌ పోస్ట్ పెట్టి జీవీ ప్రకాశ్‌ ను మోసం చేశాడని అర్థమై పోయింది. అయితే ఇదేమీ మనసులో పెట్టుకోకుండా జీవీ ప్రకాశ్ కుమార్ ఓ నెటిజన్ కు సాయం చేశాడు. రూ. 50 వేలు పంపి ‘ నా తరఫున ఇది చిన్న సాయం. ఇది నిజమని నేను నమ్ముతున్నాను’ అంటూ రిప్లై కూడా ఇచ్చారు జీవీ. దీంతో ఈ రియల్ హీరోపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇవి కూడా చదవండి

జీవీ ప్రకాష్ కుమార్ పై ప్రశంసల జల్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భారత్ సారీ చెప్పాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి.. నఖ్వీ కొత్త నాటకం
భారత్ సారీ చెప్పాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి.. నఖ్వీ కొత్త నాటకం
మినప, పెసల కంటే 100 రెట్లు ఎక్కువ.. ఒక్కటి తిన్నా చాలు ఉల్లాసంగా
మినప, పెసల కంటే 100 రెట్లు ఎక్కువ.. ఒక్కటి తిన్నా చాలు ఉల్లాసంగా
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఎంత బోనస్ అంటే..
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఎంత బోనస్ అంటే..
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..