Jyothi Rai: ఎదపై పచ్చబొట్టు చూపించిన జగతి మేడమ్.. గ్లామర్ ఫోటోలతో గత్తరలేపిన జ్యోతి రాయ్..

|

Aug 07, 2024 | 3:00 PM

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సీరియల్లో జగతి మేడమ్ పాత్రలో సహజ నటనతో తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఈ సీరియల్లో చీరకట్టులో ఎంతో సంప్రదాయంగా, హుందాగా కనిపించిన జగతి మేడమ్.. సోషల్ మీడియాలో మాత్రం

Jyothi Rai: ఎదపై పచ్చబొట్టు చూపించిన జగతి మేడమ్.. గ్లామర్ ఫోటోలతో గత్తరలేపిన జ్యోతి రాయ్..
Jyothi Rai
Follow us on

శాండల్‌వుడ్ నటి జ్యోతిరాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొదట్లో కన్నడలో పలు సీరియల్స్ చేసిన ఆమె.. ఆ తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సీరియల్లో జగతి మేడమ్ పాత్రలో సహజ నటనతో తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఈ సీరియల్లో చీరకట్టులో ఎంతో సంప్రదాయంగా, హుందాగా కనిపించిన జగతి మేడమ్.. సోషల్ మీడియాలో మాత్రం సంచలనం సృష్టిస్తోంది. చిట్టి పొట్టి డ్రెస్సులతో నెట్టింట హీటెక్కిస్తోంది. ఇటు సీరియల్స్ నుంచి తప్పుకొని ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోస్, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా జ్యోతి రాయ్ షేర్ చేసిన కొత్త తరహా గ్లామర్ ఫోటో షూట్‌ నెట్టింట తెగ వైరలవుతుంది.

స్పోర్ట్స్ తరహా దుస్తులతో.. మత్తెక్కించే ఫోటోషూట్ తో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఫోటో షూట్ లో హాట్ వెదర్ ని క్రియేట్ చేసింది. అలాగే ఈ ఫోటోలలో జ్యోతిరాయ్ ఎదపై ఉన్న సీతాకోకచిలుక టాటూ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. సీతాకోకచిలుకతోపాటు hope అనే ఇంగ్లీష్ లెటర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ ఫోటో షూట్‌లో జ్యోతిరాయ్ కుర్ర హీరోయిన్లకు ధీటుగా కనిపించింది. ఛాతీపై సీతాకోక చిలుక ఉన్న జ్యోతి రాయ్ ఫోటో షూట్ మరింత దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇవి కూడా చదవండి

జ్యోతిరాయ్ కెరీర్ ప్రారంభంలో ఎంతో సింపుల్‌గా కనిపించి ఆకట్టుకుంది. ఇక గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడమ్ పాత్రలో హుందాగా.. రిషికి తల్లిగా చీరకట్టుతో గృహిణిలా కనిపించింది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీని నెట్టింట గ్లామర్ లుక్స్ లో చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అచ్చం హీరోయిన్ లా కనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.. కొన్నిరోజుల క్రితం జ్యోతిరాయ్ డైరెక్టర్ సురేష్ కుమార్ పూర్వాజ్‌ని రెండవసారి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జ్యోతి రాయ్ కన్నడ చిత్రం నైస్ రోడ్ లో నటించింది. ఈ చిత్రాన్ని జూలై 26న విడుదల చేయాలని భావించారు. అయితే టైటిల్ కారణంగానే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.