Pawan Kalyan: పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లతో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? యాంకర్ టు యాక్టర్.. ఇప్పుడేమో..

|

Aug 07, 2024 | 6:22 PM

పై ఫొటోలో పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లతో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఆకట్టుకుంది. ఇప్పుడేయో యువ నటులకు అవకాశం కల్పిస్తూ నిర్మాతగా అవతారమెత్తింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ ఫుల్ బిజి బిజీగా ఉంటోంది

Pawan Kalyan: పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లతో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? యాంకర్ టు యాక్టర్.. ఇప్పుడేమో..
Pawan Kalyan, Renu Desai
Follow us on

పై ఫొటోలో పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లతో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఆకట్టుకుంది. ఇప్పుడేయో యువ నటులకు అవకాశం కల్పిస్తూ నిర్మాతగా అవతారమెత్తింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ ఫుల్ బిజి బిజీగా ఉంటోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. కొన్ని నెలల క్రితం ఈ అమ్మాయి వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. భర్తతో విడాకులు తీసుకుని విడిపోయింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల నుంచి బయట పడాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఆమె మాత్రం చేదు జ్ఞాపకాల నుంచి బయట పడేందుకు మళ్లీ సినిమాలనే మార్గంగా ఎంచుకుంది. పైగా ఔత్సాహిక నటీనటులకు అవకాశం కల్పిస్తూ నిర్మాతగా మారింది. ఇప్పుడు ఏకంగా 11 మంది కొత్త కుర్రాళ్లతో సినిమాను నిర్మించింది. ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటోందామె. ఎక్కడ చూసినా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా అంటూ స్లోగన్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తోన్న ఆమె మరెవరో కాదు మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. ఇందులో పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ లతో పాటు అల్లు అర్జున్ లను కూడా మనం చూడవచ్చు.

మెగా ఫ్యామిలీ వారసత్వంతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నిహారిక. కొన్ని సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. అయితే పెళ్లయ్యాక మాత్రం నటనకు స్వస్తి చెప్పేసింది. అయితే విడాకుల తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సినిమాల్లో నటిస్తూనే, నిర్మాతగానూ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం 11 మంది కొత్త నటీనటులతో కమిటీ కుర్రోళ్లు అనే సినిమా నిర్మించింది. యదు వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పిఠాపురం వెళ్లింది నిహారిక. అక్కడి కుక్కుటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది.

ఇవి కూడా చదవండి

 

కమిటీ కుర్రాళ్లు ప్రమోషన్లలో మెగా డాటర్ నిహారిక.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.