Tollywood: ఈ బబ్లీ గర్ల్‌ను గుర్తు పట్టారా? స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు.. ఇప్పుడేమో ఇండస్ట్రీకి దూరంగా..

|

Sep 10, 2024 | 12:07 PM

పై ఫొటోలోని బబ్లీ గర్ల్ ను గుర్తు పట్టారా? ఈ పాప ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. రెండేళ్ల క్రితం వరకు వరుసగా సినిమాలు చేసింది. అది కూడా స్టార్ హీరోలతో కలిసి. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ మెరిసింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు కూడా తెచ్చుకుంది

Tollywood: ఈ బబ్లీ గర్ల్‌ను గుర్తు పట్టారా? స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు.. ఇప్పుడేమో ఇండస్ట్రీకి దూరంగా..
Tollywood Actress Childhood Photo
Follow us on

పై ఫొటోలోని బబ్లీ గర్ల్ ను గుర్తు పట్టారా? ఈ పాప ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. రెండేళ్ల క్రితం వరకు వరుసగా సినిమాలు చేసింది. అది కూడా స్టార్ హీరోలతో కలిసి. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ మెరిసింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు కూడా తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లో విలన్ గానూ అదరగొట్టింది. అయితే ఎందుకోగానీ ఈ ముద్దుగుమ్మకు స్టార్ డమ్ రాలేదు. అల్లు అర్జున్, నాని, గోపీచంద్, ఆర్య, రానా దగ్గుబాటి, సిద్ధార్థ్, విజయ్ దేవరకొండ, కల్యాణ్ రామ్, నితిన్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. ఆ మధ్యన తనకున్న ఓ వింత జబ్బును బయట పెట్టి వార్తల్లో నిలిచిందీ అందాల తార. కారణమేంటో స్పష్టంగా తెలియదు కానీ గత రెండేళ్లుగా ఒక్క సినిమాలోనూ కనిపించలేదీ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటోంది. మరి ఈ క్యూటీని గుర్తు పట్టారా? తను మరెవరో కాదు ఇద్దరమ్మాయిలు, సరైనోడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన క్యాథరిన్ ట్రెసా. మంగళవారం (సెప్టెంబర్ 10) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు క్యాథరిన్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే ఆమెకు సంబంధించిన చిన్న నాటి ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

వరుణ్ సందేశ్ నటించిన చమ్మక్ చల్లో మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది క్యాథరిన్. ఆ తర్వాత అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో మూవీలో నటించి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పైసా, ఎర్ర బస్, రుద్రమదేవి చిత్రాల్లో కూడా నటించింది. అల్లు అర్జున్ తో కలిసి సరైనోడు లో సెకెండ్ హీరోయిన్ గా నటించింది. నేనే రాజు నేనే మంత్రి, విజయ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్, జయ జానకీ నాయక, కల్యాణ్ రామ్ బింబిసారా, నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ గానూ, స్పెషల్ పాత్రల్లో నూ మెరిసింది.

ఇవి కూడా చదవండి

క్యాథరిన్ ట్రెసా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

 

అయితే గత రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది క్యాథరిన్. ఆమె చివరిగా 2022లో రిలీజైన నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో కనిపించింది.

 స్విమ్మింగ్ పూల్ లో క్యాథిరిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.