Tollywood: గాంధీజీ వేషంలో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరో.. డ్యాన్సులు, ఫైట్లలో తోపు

|

Mar 24, 2025 | 7:19 PM

తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ ఈ టాలీవుడ్ హీరో కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. భారీ దేహంతో హల్క్ లా కనిపించే ఈ నటుడు డ్యాన్సు లు, ఫైట్స్ ఇరగదీస్తాడంతే!

Tollywood: గాంధీజీ వేషంలో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరో.. డ్యాన్సులు, ఫైట్లలో తోపు
Tollywood Actor
Follow us on

జాతిపిత మహాత్మ గాంధీ వేషంలో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టరా? వెంటనే కచ్చితంగా గుర్తుపట్టడం కష్టమే అనుకోండి.
ఇతను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కుమారుడు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. జయాపజయాలతో సంబంధం ఇప్పటివరకు ఓ డజను వరకు సినిమాలు చేశాడు. తన డ్యాన్స్ లు, ఫైట్లతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్యన బాలీవుడ్ లోనూ అడుగు పెట్టాడు. కానీ అక్కడ నిరాశే ఎదురైంది. మళ్లీ ఇప్పుడు ఓ భారీ మల్టీస్టారర్ మూవీతో మన ముందుకు వస్తున్నాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే.. ఈ హీరో పాన్ ఇండియా ఫేమస్. ఎలా అంటే ఈ హీరో సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా యూట్యూబ్ లో మాత్రం రికార్డు వ్యూస్ తెచ్చుకుంటాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్లలో ఈ నటుడి సినిమాలు యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించాయి. మరి ఈ బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. ఈ హీరో ఇప్పుడు మంచు మనోజ్, నారా రోహిత్ లతో కలిసి ఓ భారీ మల్టీ స్టారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పుడు మైండ్ లోకి వచ్చిందా? ఈ బుడ్డోడు ఎవరో? యస్. అతను మరెవరో కాదు మన అల్లుడు శీను బెల్లం కొండ శ్రీనివాస్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ హీరో ఒక సందర్భంలో తన చిన్ననాటి ఫొటోను పంచుకున్నాడు. అందులో ఇలా గాంధీజీ వేషంలో ఎంతో క్యూట్ గా కనిపించాడు.

కాగా బెల్లం కొండ శ్రీనివాస్ సినిమా రాక సుమారు నాలుగేళ్లవుతోంది. 2023లో బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ చేసినా నిరాశే ఎదురైంది. అందుకే ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలతో మన ముందుకు వస్తున్నాడు. అవి కూడా ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ మూవీస్ అయిన డివోషనల్, హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీస్ తో వస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

భైరవం సినిమాలో బెల్లం కొండ శ్రీనివాస్..

ప్రస్తుతం భైరవం, హైందవ అనే డివోషనల్ హారర్ థ్రిల్లర్ సినిమాల్లో నటిస్తున్నాడు శ్రీనివాస్. అలాగే టైసన్ నాయుడు అనే మరో మూవీలోనూ హీరోగా నటిస్తున్నాడు.

ఫ్యామిలీతో..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.