Tollywood: ఈ క్యూట్ బుజ్జాయి టాప్ హీరోయిన్.. సౌత్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టగలరా ?..

సినిమాల్లో తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అలాగే అనుహ్యంగా ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలోని స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె కేరాఫ్ అడ్రస్. ఈరోజు తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది.

Tollywood: ఈ క్యూట్ బుజ్జాయి టాప్ హీరోయిన్.. సౌత్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actress
Follow us

|

Updated on: Apr 03, 2024 | 8:50 PM

సినీతారల చిన్ననాటి ఫోటోస్ చూసేందుకు అభిమానులు ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటారు. అందుకే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో మీ ముందుకు తీసుకువచ్చాం. పైన ఫోటోలో తన తండ్రితో కలిసి ఉన్న బుజ్జాయి.. ఇప్పుడు టాప్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అలాగే అనుహ్యంగా ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలోని స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె కేరాఫ్ అడ్రస్. ఈరోజు తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. ఎవరో గుర్తుపట్టగలరా ?. తను మరెవరో కాదండి. లేడీ సూర్ స్టార్ నయనతార.

నయనతార అసలు పేరు డయానా మరియం. 1984 నవంబర్ 18న తిరువళ్లలోని ఓ సాధారణ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనుకుంది. కానీ అనుహ్యంగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేసిన నయన్ ను చూసి డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ ఆమెకు మనస్సినక్కరే సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత తమిళంలో అనేక సినిమాల్లో నటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి మూవీతో ఆమెకు గుర్తింపు వచ్చింది. అలాగే తెలుగులో లక్ష్మీ, బాస్ చిత్రాలు పేరు తెచ్చిపెట్యాయి. ఓ సాధారణ అమ్మాయి నుంచి లేడీ సూపర్ స్టార్ గా సాగిన ప్రయాణం సినిమా కథలా ఉంటుంది. వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై బలమైన మహిళగా నిలిచింది. గత 20 ఏళ్లుగా నయనతార కెరీర్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. తన వ్యక్తిగత, కెరీర్‌లో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ ఎక్కడా తగ్గకుండా స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

గతేడాది షారుఖ్ ఖాన్, డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈసినిమా కోసం నయన్ రూ. 10 కోట్లు పారితోషికం తీసుకుందట. నివేదికల ప్రకారం నయన్ ఆస్తిలు విలువ దాదాపు రూ. 183 కోట్లు. హైదరాబాద్ , చెన్నై, కేరళ వంటి ప్రాంతాల్లో విలాసవంతమైన భవనాలు కలిగి ఉంది. అలాగే సొంతంగా ప్రైవేట్ జెట్ ఉన్న ఏకైక హీరోయిన్. నటనతో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, సినిమాల నిర్మాణం, సోషల్ మీడియాలో ప్రమోషన్స్, 9 స్కిన్ అనే చర్మ సంరక్షణ బ్రాండ్ వంటి పెట్టుబడుల ద్వారా డబ్బు సంపాదిస్తుంది. సౌత్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ హీరోయిన్ ఆమె. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కవలలు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.