Tollywood: నాట్యమయూరి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సెషన్.. కుర్రకారు లేటేస్ట్ క్రష్ ఈ ముద్దుగుమ్మ.. ఎవరో గుర్తుపట్టగలరా ?..

ఫోటోలో చూశారా ?. తనే ఆ అందాల నాట్యమయూరి. ఇప్పుడు నెట్టింట ఈ అమ్మాడి పేరు సెన్సెషన్ అవుతుంది. కలువ కన్నులు.. చంద్రబింబం వంటి మోము.. చక్కటి చిరునవ్వు.. సంప్రదాయ లుక్‏లో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేసింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ఈ కేరళ అందాల రాశికి ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఇంతకీ గుర్తుపట్టారా ?..

Tollywood: నాట్యమయూరి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సెషన్.. కుర్రకారు లేటేస్ట్ క్రష్ ఈ ముద్దుగుమ్మ.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actress
Follow us

|

Updated on: Feb 11, 2024 | 11:55 AM

ఒకే ఒక్క సినిమా నటీనటుల జీవితాలను తారుమారు చేసేస్తుంది. అప్పటివరకు స్టార్ డమ్ ఉన్నవారికి ఆఫర్స్ దూరం కావచ్చు. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తున్న వారిని అగ్రస్థానానికి చేర్చవచ్చు. ఇప్పడంతా సోషల్ మీడియా ప్రపంచంగా మారింది. తమ అభిమాన తారలకు సంబంధించిన పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి నెట్టింట తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే వారి ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తు మురిసిపోతుంటారు. ఇప్పుడు నెట్టింట ఓ హీరోయిన్ పేరు మారుమోగుతుంది. ఎక్కడా చూసిన తన ఫోటోస్.. సాంగ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు యూత్ లేటేస్ట్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది. ఇంతకీ తను ఎవరు అనుకుంటున్నారా ?..పైన ఫోటోలో చూశారా ?. తనే ఆ అందాల నాట్యమయూరి. ఇప్పుడు నెట్టింట ఈ అమ్మాడి పేరు సెన్సెషన్ అవుతుంది. కలువ కన్నులు.. చంద్రబింబం వంటి మోము.. చక్కటి చిరునవ్వు.. సంప్రదాయ లుక్‏లో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేసింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ఈ కేరళ అందాల రాశికి ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఇంతకీ గుర్తుపట్టారా ?.. తను ‘జో (Joe)’ మూవీ హీరోయిన్ మాళవిక మనోజ్. ఇప్పుడు అందరి చూపు ఈ బ్యూటీ పైనే.

హరి హరన్ రామ్ దర్శకత్వం వహించిన జదో సినిమాలో రియో రాజ్, మాళవిక మనోజ్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది నవంబర్ 24న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అయితే అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రాజారాణి సినిమాను గుర్తుచేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఇందులో సుచిత్ర పాత్రలో కనిపించింది మాళవిక మనోజ్. అందం, అభినయంతో కట్టిపడేసింది.

మాళవిక మనోజ్.. శాస్త్రీయ నృత్యకారణి. 2012 ప్రకాశన్ పరక్కట్టే సినిమాతో తమిళ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత జో, నాయాది చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కేరళలో పుట్టి, సౌదీ అరేబియాలోని జెద్దాలో ఒక మలయాళీ కుటుంబంలో పెరిగారు. ఆమె తల్లి ప్రసీత మనోజ్ నృత్యకారిణి. మాళవిక తన పాఠశాల విధ్యాబ్యాసాన్ని జెడ్డాలోని ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్లో పూర్తి చేసింది. అలాగే నాట్యంలో శిక్షణ తీసుకుంది. మాథ్యూ థామస్ నటించిన ప్రకాశన్ పరక్కట్టే చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.