Tollywood: ఓర్నీ.. 3 సినిమాలో శ్రుతిహాసన్ చెల్లి గుర్తుందా.? ఇప్పుడు హీరోయిన్

|

Oct 20, 2024 | 10:44 AM

3 సినిమాలో శ్రుతిహాసన్ చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా.? తను ఇప్పుడు ఎలా ఉంది..? ఏం చేస్తోంది..? అని నెటిజన్స్ తెగ వెతుకుతున్నారు. మీ బాధ మాకు అర్థం అయింది. అందుకే తన గురించి అన్ని డీటేల్స్ మీ ముందకు తెచ్చాం...

Tollywood: ఓర్నీ.. 3 సినిమాలో శ్రుతిహాసన్ చెల్లి గుర్తుందా.? ఇప్పుడు హీరోయిన్
Gabriella Charlton
Follow us on

తమిళ హీరో ధనుష్ విభిన్నతతో కూడిన సినిమాలకు కేరాఫ్ అడ్రస్.  హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు ఈ అగ్ర హీరో. రీసెంట్‌గా రాయన్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు ఈ హీరో. ఈ సినిమాను తనే డైరెక్ట్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే ధనుష్ నటించిన త్రీ(3) మూవీ ఆడియెన్స్‌కు తెగ నచ్చేసింది . 2012 మార్చి 30న ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాకు ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా శ్రుతిహాసన్ అదరగొట్టేసింది. అలాగే ఈ సినిమాలో టీనేజ్ ప్రేమకథను కూడా చూపించారు. ఇక ఈ మూవీతో శ్రుతిహాసన్ చెల్లిగా నటించిన ఆర్టిస్ట్ గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుంది అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.  తన పేరు గాబ్రియెల్లా నటాలీ చార్ల్టన్. పలు సినిమాల్లో బాలనటిగా అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్ ఫీచర్స్‌తో అదరగొట్టేస్తుంది.

9 ఏటే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన గాబ్రియెల్లా.. బాలనటిగా అదరగొట్టేసింది. అలాగే పలు డాన్స్ రియాల్సిటీ షోలతోనూ సందడి చేసింది. ఈ క్రమంలోనే త్రీ సినిమాలో నటించే చాన్స్ అందుకుంది. ఆ మూవీలో శ్రుతి చెల్లిగా కనిపించింది. ఆ సినిమా వచ్చిన మూడేళ్లకు హీరోయిన్‌గా టర్న్ అయింది ఈ బ్యూటీ. అప్పా మూవీతో రషిత పాత్రలో మెరిసింది. ఆ తర్వాత ఈ చిన్నది సినిమాలకు బ్రేక్ ఇచ్చి స్టడీపై పెట్టింది. ఇక ఇప్పుడు తిరిగి స్మాల్ స్క్రీన్ పై మరోసారి సందడి చేస్తోంది. ఓ వైపు టీవీ షోలు చేస్తూనే మరో వైపు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో తన అందాలతో కుర్రకారు మది దోచుకుంటుంది. తన పిక్స్‌కు ఓ రేంజ్‌లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.