ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు

అప్పుడప్పుడు, నటీనటులకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. నిత్యం ఏదోక త్రోబ్యాక్ పిక్చర్ నెట్టింట హల్చల్ చేస్తుంటుంది. ప్రస్తుతం పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె చాలా పాపులర్ హీరోయిన్. తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు
Actress

Updated on: Jul 28, 2026 | 12:31 PM

సినీ సెలబ్రెటీల ఫోటోలు, సినిమాలకు సంబందించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే సినీ తారలు కూడా తమ సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు, ముఖ్యంగా హీరోయిన్స్.. చాలా మంది అందాల భామలు సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు. తమ లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వరకు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు అందాల భామలు. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ కళ్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పై ఫొటోలో కనిపిస్తున్న కళ్లు ఏ హీరోయిన్‌వో గుర్తుపట్టారా.? ఆమె చాలా పాపులర్ హీరోయిన్.? చాలా మంది అభిమాన హీరోయిన్ ఆమె.

ఇది కూడా చదవండి : వారెవ్వా..! చంద్రముఖి చిన్నారి ఎంత మారిపోయింది..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

పై ఫోటోలో కనిపిస్తున్న కళ్లు చాలా మందికి పరిచయమున్న కళ్లే.. ఆ హీరోయిన్ ఇప్పుడు మన మధ్య లేదు. కానీ ఆమె జ్ఞాపకాలు మాత్రం ప్రేక్షకులతో ఎప్పుడూ ఉంటాయి. ఆమె మరెవరో కాదు అందాల తార ఆర్తి అగర్వాల్. ‘నువ్వు నాకు నచ్చావ్’ అంటూ 16 ఏళ్ల వయసులో టాలీవుడ్ వెండితెరపై సందడి చేసింది ఆర్తీ అగర్వాల్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. మొదటి సినిమాతోనే స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‏తో జతకట్టిన ఆర్తి… ఆ తర్వాత ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, తరుణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ వంటి అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 21 సినిమాలు చేస్తే.. మూడు మాత్రమే హిట్..! కట్ చేస్తే విలన్‌గానూ అదరగొట్టాడు

ముఖ్యంగా ఇంద్ర సినిమాలో చిరంజీవికి ప్రేయసిగానే కాదు.. ఎదురించే ప్రతినాయికగానూ ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. చిన్న వయసులోనే స్టార్ డమ్ అందుకుని.. టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన ఆర్తి అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయింది. కెరీర్ పీక్ లో ఉండగానే 2005లో క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఏడాది.. మెట్లపై నుంచి పడి ఆసుపత్రిలో చేరింది. ఆతర్వాత కోలుకొని తిరిగి సినిమాలు చేయాలనుకుంది. ఈ క్రమంలోనే 2007లో న్యూజెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్ ను పెళ్లి చేసుకుంది ఆర్తి. ఆ తర్వాత కొంత కాలంగా వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేయాలనుకున్న క్రమంలో బరువు తగ్గేందుకు చేయించుకున్న లైపోసక్షన్ సర్జరీ   వికటించి కన్నుమూసింది ఆర్తి అగర్వాల్. ఇలా కేవలం 31ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది ఆర్తి.

ఇది కూడా చదవండి : Raja Ravindra: ఆ హీరో పెళ్ళికి నేను కాళ్లు కడిగాను.. ఆ ఇద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us