
కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి రచితా రామ్. ఈ అందాల భామ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. అక్టోబర్ 3న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులను కలుసుకున్న ఆమెకు ఓ అభిమాని ఊహించని రీతిలో షాకిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులను కలుసుకోవడం రచితా రామ్‌కు అలవాటు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. వారితో ఫొటోలు దిగుతూ, సెల్ఫీలు ఇస్తూ రచితా రామ్ సందడి చేస్తారు. ఈ ఏడాది కూడా తన అభిమానులతో కొంత సమయం గడిపిన ఆమె.. చాలామందితో సెల్ఫీలు దిగారు. అయితే ఈ క్రమంలో ఓ అభిమాని చేసిన పని మాత్రం అందరి అవాక్ అయ్యేలా చేసింది.
రచితా రామ్ దగ్గరకు వచ్చిన ఓ అభిమాని ముందుగా ఆమెతో సెల్ఫీ తీసుకున్నాడు. తర్వాత ఆమెకు షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా ఒక్కసారిగా రచితా రామ్ రెండు బుగ్గలను పట్టుకుని గిల్లాడు. దాంతో హీరోయిన్ ఒక్కసారిగా ఆమె షాక్ అయ్యింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మొత్తం సన్నివేశం కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొందరు దీన్ని సరదా ఫ్యాన్ మూమెంట్‌గా కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం అభిమాని ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు బుగ్గలను పట్టుకుని గిల్లిన తర్వాత రచితా రామ్ క్యూట్‌గా నవ్వింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
అభిమానులు తమకు ఇష్టమైన సెలబ్రిటీలను కలిసినప్పుడు ఉత్సాహంగా కొన్ని చిత్రవిచిత్రమైన చేష్టలు చేస్తుంటారు. అయినప్పటికీ.. సెలబ్రిటీ వ్యక్తిగత హద్దులను గౌరవించాల్సిన అవసరం ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అనుమతి లేకుండా శారీరకంగా తాకడం సరైన పద్ధతి కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. రచితా రామ్ ప్రధానంగా కన్నడ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే తెలుగు, తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించి మెప్పించింది. తెలుగులో ‘సూపర్ మచ్చి’ వంటి సినిమాల్లో నటించిన ఆమె.. ఇతర దక్షిణాది భాషల్లోనూ తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళంలో రజనీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రంతోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది.
😄 Be honest, what kind of fan are you—playful 😜 or calm 😇?
Which one are you? 👀#RachitaRam pic.twitter.com/F3A16HFc9W
— Filmyyy__duniyaaa (@Filmyduniyaaa) October 3, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.