
తెలంగాణ జానపద పాటలకు రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతోంది. ముఖ్యంగా యూట్యూబ్ లో కొత్త పాట వచ్చిందంటే చాలు.. యువత ఇన్ స్టా గ్రామ్ రీల్స్, షార్ట్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అలా ఇప్పుడు ఒక కొత్త ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. ఇక తెలంగాణ ఫోక్ సాంగ్స్ విషయంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ఫోక్ డ్యాన్సర్ కమ్ సింగర్ ఈశ్వర్ సాయి. ఇప్పటికే ఆయన చేసిన ‘బాసింగా బలాలే’, ‘సన్న సన్న బియ్యమే’, ‘సీటీ చీర’, ‘రాతిరి రాతిరి రాతిరిలో’ వంటి జానపద పాటలు ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ‘బాసింగా బలాలే’ పాట ఈశ్వర్ సాయి క్రేజ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. చాలా నెలల క్రితం రిలీజైన ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. అలా రీసెంట్ గా ఈశ్వర్ సాయి నుంచి వచ్చిన మరో పాట బావో మల్లారెడ్డి సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతోంది. ‘ఆ సీటీ సీర తెత్తా.. నీకు సిగల పూలు తెత్తా.. శిలకట్ల కాడే కలువే ఓ చిలుక ముక్కు దాన’ లిరిక్స్ తో సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. అచ్చమైన తెలంగాణ పల్లెటూరి యాస, పదాలు, అదిరిపోయే మ్యూజిక్, ఆకట్టుకునే డ్యాన్స్ స్టెప్పులు ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.
‘బావో మల్లారెడ్డి’ పాటలో ఈశ్వర్ సాయికి జోడీగా రిధి కనిపించారు. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చిందనే చెప్పాలి. అలాగే వీరి ఎనర్జిటిక్ స్టెప్పులు, ఎక్స్ ప్రెషన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటను కిస్రా మ్యూజిక్ విడుదల చేసింది. సింగర్స్ నరసింహులు, ఉష ఈ పాటను ఎంతో హుషారుగా ఆలపించారు. శ్రీలత యాదవ్ ఈ సినిమాకు సాహిత్యం అందించారు. అలాగే హనీ గణేష్ స్వరాలు సమకూర్చారు. గురు మాస్టర్ ఈ సినిమాకు కొరియోగ్రఫీ అందించడంతో పాటు డైరెక్షన్ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఇక అరుణ్ జగతి ఈ పాటకు డీవోపీగా పని చేశారు. మరి ప్రస్తుతం యూట్యూబ్ లో దుమ్మురేపుతోన్న బావో మల్లారెడ్డి సాంగ్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.