Sitaramam: ప్రేమికుల కోసం మనసులను తాకిన ప్రేమకథ మళ్లీ వచ్చేస్తుంది.. ‘సీతారామం’ రీరిలీజ్..

మనసులను తాకి.. కన్నీళ్లు తెప్పించిన లవ్ స్టోరీ సీతారామం మళ్లీ రాబోతుంది. 2022లో విడుదలైన ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో మృణాల్, దుల్కర్ సల్మాన్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే ఈ మూవీలోని సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ శ్రోతలను మెస్మరైజ్ చేస్తుంటాయి.

Sitaramam: ప్రేమికుల కోసం మనసులను తాకిన ప్రేమకథ మళ్లీ వచ్చేస్తుంది.. 'సీతారామం' రీరిలీజ్..
Sitaramam
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 11, 2024 | 1:10 PM

వాలెంటైన్ వీక్ నడుస్తుంది. ఫిబ్రవరి 7న మొదలైన ప్రేమికుల వారం.. 1 వరకు సాగుతుంది. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, ప్రామిస్ డే, టెడ్డీ డే, హగ్ డే, కిస్ డే, వాలెంటైన్స్ డే అంటూ మొత్తం 7 రోజులు ఎంతో సరదాగా జరుపుకుంటుంటారు. ఇక ప్రేమికుల కోసం ఇప్పుడు అందమైన ప్రేమకథలను మళ్లీ థియేట్రలలోకి తీసుకువస్తున్నారు. ఇక ఇప్పుడు జనాల మనసులను తాకి.. కన్నీళ్లు తెప్పించిన లవ్ స్టోరీ సీతారామం మళ్లీ రాబోతుంది. 2022లో విడుదలైన ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో మృణాల్, దుల్కర్ సల్మాన్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే ఈ మూవీలోని సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ శ్రోతలను మెస్మరైజ్ చేస్తుంటాయి.

ఇదిలా ఉంటే.. సీతారామం సినిమాను ఈ వాలెంటైన్స్ డే రోజున ఫిబ్రవరి 14న మళ్లీ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. “ఈ వాలెంటైన్స్ డే మీ అందరినీ సినిమా ప్రేమ కోసం, ప్రేమ ప్రేమ కోసం తిరిగి వస్తున్నాం.. సీతారామం ఈ పిబ్రవరి 14న మళ్లీ విడుదలవుతుంది” అంటూ రాసుకొచ్చారు. దీంతో మరోసారి సీతారామం విడుదలవుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

ఈ సినిమాలో సచిన్ ఖేడేకర్, సుమంత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సునీల్, భూమికా చావ్లా, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు విశాల చంద్రశేఖర్ అందించిన సంగీతం గురించి మాటలు చాలవు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.