హైదరాబాద్: రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్..ఈ సెన్సేషన్ మ్యూజిక్ డైరక్టర్ గురించి సపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అతని సోదరుడు సాగర్ కూడా గాయకుడిగా, టీవీ షో వ్యాఖ్యాతగా అందరికి సుపరిచితుడే. తాజాగా ఈయన రాక్షసుడు సినిమా ద్వారా ‘రాక్షసుడు’ సినిమాతో డైలాగ్ రైటర్‌గా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు సాగర్ ఒక ఇంటివాడయ్యాడు. తన సోదరుడు, గాయకుడు సాగర్ వివాహం జరిగిందని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జూన్ 19న సాగర్, మౌనికల వివాహం జరిగిందని ఆయన ట్వీట్‌లో వెల్లడించారు. ఈ శుభకార్యంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారని ఆయన పేర్కోన్నారు.
Happy 2 announce dat my Dearest Brother @sagar_singer got married to @DMounicasagar amidst a close Family Gathering on 19th JUNE, which also happens 2 be d Wedding Anniversary of my Parents❤️??
Welcomin MOUNIKA SAGAR 2 d Family❤️
The Couple needs all ur LOVE & BLESSINGS???❤️? pic.twitter.com/7M7ewUMak1
— DEVI SRI PRASAD (@ThisIsDSP) July 10, 2019