సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో రకరకాల పనులు చేసే వారు. కొంతమంది సేల్స్ గర్ల్స్ గ మరికొంతమంది కాల్ సెంటర్స్ లో కూడా పని చేశారు. మరికొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. అలాగే డాక్టర్స్ కూడా ఉన్నారు. అదృష్టం కలిసొచ్చి హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది. ఆ టైం లోనే పెళ్లి కూడా చేసుకుంది. కానీ సినిమాల్లో ఆఫర్స్ రావడంతో పెళ్లి మ్యాటర్ ను సీక్రెట్ గా ఉంచింది. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ గా మారింది. సినీ ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఆ అమ్మడి అందానికి ప్రేక్షకులు పడి చచ్చిపోతారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
పైన మాట్లాడుకున్న బోల్డ్ బ్యూటీ ఎవరో కాదు హాట్ బ్యూటీ మల్లికా శెరావత్. ఈముద్దుగుమ్మ గురించి తెలియని వాళ్ళు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపింది మల్లికా శెరావత్. ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం మల్లికా శెరావత్ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ చిన్నది సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాతో అభిమానులకు చాలా యాక్టివ్ గా ఉంటుంది. వయసు పెరుగుతున్నా కూడా తరగని అందంతో ఆకట్టుకుంటుంది. ఇప్పటికి కూడా బికినీ ఫోజులతో కవ్విస్తోంది. అంతే కాదు ఇప్పటికే చాలా కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లోనూ నిలిచింది.
కెరీర్ బిగినింగ్ లో ఈ చిన్నది ఎయిర్ హోస్టెస్‌గా పని చేసింది. అదేసమయం మల్లిక ఢిల్లీకి చెందిన పైలట్ కరణ్ సింగ్ గిల్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. నాలుగేళ్ల తరువాత, బాలీవుడ్‌లో ఆఫర్స్ రావడంతో ఆమె విడాకులు తీసుకుంది. పెళ్లయిందని, విడాకులైందన్న సంగతి తెలిస్తే బాలీవుడ్లో తన ఎదుగుదలకు అడ్డు వస్తుందని భావించి ఆమె తనకు పెళ్ళైందన్న సంగతిని దాచిపెట్టింది. ఈ చిన్నది బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. అలాగే బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. ఇప్పుడు సినిమాలకు దూరంగా సోషల్ మీడియాతో అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి