
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది అచ్చ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. అంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన వైష్ణవి.. నెమ్మిదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన వైష్ణని బేబీ సినిమాతో హీరోయిన్ గా మారింది. డైరెక్టర్ సాయి తేజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించారు. 2023 జూలై 14న విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇందులో తన నటనతో అదరగొట్టేసింది వైష్ణవి చైతన్య. ఈ సినిమాలో వైష్ణవి స్నేహితురాలిగా కనిపించిన అమ్మాయి గుర్తుందా.. ? ఢీగ్లామర్ లుక్ లో కనిపించిన ఆ అమ్మాయి.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
బేబీ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించిన అమ్మాయి కుసుమ డేగలమారి. ఈ మూవీ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లిన తర్వాత చెడు సావాసాలకు ఆకర్షితురాలై.. ప్రేమించిన వ్యక్తిని మోసం చేస్తున్న తీరు నచ్చక వారిస్తుంది. అయినప్పటికీ హీరోయిన్ మారకపోవడంతో హీరోయిన్ కు దూరంగా ఉంటుంది. ఈ సినిమాలో పాజిటివ్ రోల్ పోషించింది కుసుమ. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా కాలంగా ఈ అమ్మడు మరో సినిమాలో కనిపించలేదు.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
కుసుమ డేగలమారి విషయానికి వస్తే..
ఆమె వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా, మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఇన్ స్టాలో క్రేజీ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. ఫస్ట్ మూవీతోనే పాపులర్ అయిన కుసుమ.. తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఈబ్యూటీ నెట్టింట గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..