
ఒకప్పుడు టీవీలో వచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కాకుండా హారర్ సీరియల్స్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకునేవి. ముఖ్యంగా వీకెండ్స్ లో కొన్ని సీరియల్స్ ఎక్కువగా ప్రసారమయ్యేవి. కొన్నాళ్ల క్రితం భయానకమైన కథ.. వణికిపోయేలా చేసిన కంటెంట్ ఎక్కువ మందిని ఆకర్షించింది. హారర్ సీరియల్ అందరి దృష్టిని తిప్పింది. భయంకరమైన విజువల్స్. మిస్టరీతో ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. అది 2013లో టీవీ ప్రపంచంలో వచ్చిన ఈ సీరియల్ ప్రజలను రాత్రిపూట మేల్కొని ఉండేలా చేసింది. ఆ సీరియల్లోని విజువల్స్, ట్విస్టులు వణుకు పుట్టించాయి. స్మాల్ స్క్రీన్ పై వచ్చే షోలకు డిఫరెంట్ గా సాగింది ఈ షో. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త, విభిన్నమైన కథను చూపించారు. ఈ షో పేరు భయాన్ని సృష్టించింది, ఇది ప్రతి ఇంట్లో సుపరిచితం అయింది.
ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..
ఈ షో ప్రారంభం నుండే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ షో పేరు ‘భూత్ ఆయా’. దయ్యాలు, ఆత్మలు, మర్మమైన సంఘటనల చుట్టూ ఈ సీరియల్ సాగింది. ఈ కథల్లో చాలా వరకు దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ తీసుకుని తెరకెక్కించారు. యానక సంఘటనలతో పాటు, ప్రతి ఎపిసోడ్‌లో భావోద్వేగ కోణం కూడా ఉంది. అందుకే అప్పట్లో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చేసింది. ఈ షోలో చాలా మంది ప్రసిద్ధ టీవీ నటులు వేర్వేరు కథలలో నటించారు. అంతేకాదు అప్పట్లో ఈ సీరియల్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది ప్రేక్షకులు ఈ షోను ఒంటరిగా చూడటానికి భయపడ్డారు.
ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.
ఈ షో 2013 నుండి 2014 వరకు ప్రసారమైంది. మొత్తం 23 ఎపిసోడ్‌లు భయానక కథలతో నిండి ఉన్నాయి. టీవీలో కొత్త హర్రర్ షోలు వస్తున్నాయి, కానీ ప్రజలు ఇప్పటికీ పాత హర్రర్ షోలను చూస్తున్నారు. ముఖ్యంగా ఈ భయానక భూత్ ఆయా షో మాత్రం ఇప్పటికీ ట్రెండింగ్. సోషల్ మీడియాలో అనేక క్లిప్‌లు చక్కర్లు కొడుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..