ఒకప్పుడు కుర్రాళ్లను ఉర్రుతలూగించింది.. కానీ ఇప్పుడు ఇలా.. ఆమె ఎవరో తెలుసా.?

చాలా మంది సీరియల్ నటులు, యాంకర్స్ సినిమాల్లోనూ రాణిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే చాలా మంది టీవీ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన వారే.. వారిలో ఈ ఫొటోలో కనిపిస్తున్న నటి కూడా ఒకరు. ఆమెను గుర్తుపట్టారా.? ఒకప్పుడు కుర్రాళ్లను ఉర్రుతలూగించింది ఆమె. తన అందంతో మాటకారి తనంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమె ఎవరంటే..

ఒకప్పుడు కుర్రాళ్లను ఉర్రుతలూగించింది.. కానీ ఇప్పుడు ఇలా.. ఆమె ఎవరో తెలుసా.?
Tollywood

Updated on: Apr 21, 2025 | 11:13 AM

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సెలబ్రెటీల ఫోటోలు  నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. హీరో, హీరోయిన్స్ కు సంబందించిన చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు అభిమానులు నెట్టింట వైరల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ స్టార్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటోలో ఉన్న అందాల రాశిని గుర్తుపట్టారా.? ఆమె ఒకప్పుడు టెలివిజన్ ను ఓ ఊపుఊపేసింది. యాంకర్ గా నాతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టారా.? అందంలో హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోదు. కానీ యాంకర్ గా స్టార్ డమ్ అందుకుంది. కొన్ని సినిమాల్లోనూ నటించింది. ఆమె స్టేజ్ పై నిలబడితే ప్రేక్షకులకు తెలియని ఆనందం, కుర్రాళ్ళ ఉత్సహం రెట్టింపు అవుతుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

సినిమా హీరోయిన్స్ మాత్రమే కాదు యాంకర్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లితెరమీద రాణిస్తున్న స్టార్ యాంకర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సుమ కనకాల. అలాగే అనసూయ, రష్మీ ఇలా ఇంకొంతమంది కూడా ఉన్నారు. అయితే బుల్లితెర అతిలోక సుందరి పేరుతెచ్చుకున్న యాంకర్ గుర్తుందా.? ఆమె ఎవరో కాదు.. ఉదయభాను. ఈ అందాల యాంకర్‌ను అంత ఈజీగా మర్చిపోలేరు. ఒకప్పుడు తన మాటలతో.. అందంతో, చలాకీ తనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ ఛానల్‌లో టెలికాస్ట్ అయిన హృదయాంజలి అనే కార్యక్రమంతో ప్రేక్షకులను పలకరించింది ఉదయభాను. యాంకర్‌గా చేసిన మొదటి కార్యక్రమంతోనే గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది ఉదయభాను.

ఇవి కూడా చదవండి

ఇక యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆతర్వాత చాలా కార్యక్రమాలకు యాంకర్ గా చేసి పాపులర్ అయ్యింది. వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింబకా , డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారే రే రేలా, ఢీ రియాలిటీ డ్యాన్స్ షో, జాణవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు ఇలా చాలా పాపులర్ షోల్లో యాంకర్ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక యాంకర్ గానే కాదు సినిమాల్లోనూ నటించింది ఉదయభాను. 10 వతరగతి చదువుతుండగా మొదటి సినిమా ఎర్ర సైన్యంలో చేసింది ఉదయభాను. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాలో నటించింది ఉదయభాను. అలాగే స్పెషల్ సాంగ్స్ కూడా చేసి మెప్పించింది ఈ చిన్నది. ఇక పెళ్లి తర్వాత ఉదయభాను బుల్లితెర పై కనిపించలేదు. ప్రస్తుతం ‘త్రిబాణధారి బార్బరిక్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు ఉదయభాను.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.