AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ద్యావుడా .. అజిత్ చేతిలో ఉన్న చిన్నారి ఇంతందంగా మారిపోయిందేంటీ ?.. హీరోయిన్లకు పోటీ ఖాయం..

చిన్నప్పుడు తమ నటనతో ఆకట్టుకుని.. ఇప్పుడు వెండితెరపై మెయిన్ లీడ్స్ పోషిస్తున్నారు. వీరంతా బ్యాక్ టూ బ్యాక్ సినిమాతో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఈ జాబితాలో చేరేందుకు రెడీ అయ్యింది మరో చిన్నది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. అల్లరి చిన్నారిగా.. అమాయకపు మాటలు.. అల్లరి చేష్టలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‏గా బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అయ్యింది.

Tollywood: ద్యావుడా .. అజిత్ చేతిలో ఉన్న చిన్నారి ఇంతందంగా మారిపోయిందేంటీ ?.. హీరోయిన్లకు పోటీ ఖాయం..
Ajith
Rajitha Chanti
|

Updated on: Feb 10, 2024 | 11:50 AM

Share

సినీ పరిశ్రమలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో తేజా సజ్జా.. హనుమాన్ సినిమాతో స్టార్ డమ్ అందుకున్నాడు. అటు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్, శ్రీవిధ్య, కావ్య కళ్యాణ్ రామ్, అనిక సురేంద్రన్, ఎస్తేర్ అనిల్.. చిన్నప్పుడు తమ నటనతో ఆకట్టుకుని.. ఇప్పుడు వెండితెరపై మెయిన్ లీడ్స్ పోషిస్తున్నారు. వీరంతా బ్యాక్ టూ బ్యాక్ సినిమాతో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఈ జాబితాలో చేరేందుకు రెడీ అయ్యింది మరో చిన్నది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. అల్లరి చిన్నారిగా.. అమాయకపు మాటలు.. అల్లరి చేష్టలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‏గా బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు అనుకుంటున్నారా ?.. తనే యువీనా పార్థవి.. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే.. కానీ అజిత్ సినిమా చిన్నారి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ప్రస్తుతం ఆమె లేటేస్ట్ ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

యువినా పార్థవి 2013లో విడుదలైన ‘ఇవాన్ ఏ కమల్’ చిత్రంతో తమిళ చిత్రసీమలో బాలతారగా అడుగుపెట్టింది. ఆ తర్వాత మంజాభైమా ప్యాలెస్, కత్తి వంటి చిత్రాల్లో నటించింది. ‘మాస్ అనక మాసిలామణి’లో సూర్య కూతురిగా కనిపించింది. ఇక అజిత్ నటించిన వీరమ్ సినిమాలోనూ యువినా నటించింది. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అజిత్, యువినా మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కూడా అనేక సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు యువినా టీనేజ్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

తాజాగా ఆమె సోషల్ మీడియాలో అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీరమ్ సినిమాలో చిన్నారిగా కనిపించిన ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా కనిపిస్తుందేంటీ ?.. బాబోయ్.. ఇంతందంగా మారిపోయిందేంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం యువీనా.. సైరన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. నూతన దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయం రవి, కీర్తి సురేష్ తదితరులు నటించారు. 19న విడుదలవుతున్న ‘సైరన్’ ప్రమోషన్స్‌లో యువినా పార్థవి పాల్గొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us