రోజుకు 3లక్షలు రెమ్యునరేషన్.. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాధలా చనిపోయింది

కొంతమంది సినీ హీరోయిన్స్ జీవితం చాలా విభిన్నంగా ఉంటుంది. కాస్ట్లీ కారులు, బ్రాడెడ్ బట్టలు, కోట్లు ఖరీదు చేసే ఇళ్లు , ఖరీదైన వాచ్ లు వాడుతుంటారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటూ ఉంటారు. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.

రోజుకు 3లక్షలు రెమ్యునరేషన్.. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాధలా చనిపోయింది
Actress

Updated on: Jul 31, 2026 | 12:21 PM

సామాన్యులతో పోల్చుకుంటే సెలబ్రెటీల లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తూ.. ప్రతిదీ కాస్ట్లీ గా ఉండేలా చూసుకుంటారు. చాలా తక్కువమంది సెలబ్రెటీలు మాత్రమే సింపుల్ గా జీవించడానికి ఇష్టపడుతుంటారు. చాలా మంది కాస్ట్లీ కార్లు, ఖరీదైన బంగ్లాలు, బట్టలు, వాచ్ లు ఇలా అన్ని లగ్జరీగా ఉండేలా చూసుకుంటారు. ఇక హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం హీరోయిన్స్ కూడా హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హావ నడుస్తుండటంతో.. సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దాంతో హీరోయిన్స్ కూడా భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ మాత్రం చాలా స్పెషల్.

ఇది కూడా చదవండి : ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే మావ..! భరణి మూవీ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

ఆమె ఇప్పటి హీరోయిన్ కాదు అప్పట్లోనే కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంది ఆమె.. స్టార్ హీరోలకు మించి క్రేజ్ ఉండేది ఆమెకు.. ఆ హీరోయిన్ కోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూసేవారు. ఆమె డేట్స్ కోసం నిర్మాతలు పెద్ద యుద్ధమే చేసేవారు.. ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన నటి ఆమె.. అప్పట్లోనే రోజుకు లక్ష రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకున్న ఆ నటి. చివరకు అనాధల ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఒకప్పుడు తెలుగు సినిమాను ఓ ఊపు ఊపేసిన అందాల సుందరి సిల్క్ స్మిత. ఆ కాలంలో స్టార్ హీరోయిన్‌కు మించిన క్రేజ్ సిల్క్ స్మితకు ఉండేది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇది కూడా చదవండి : సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..! ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టింది.. ఇప్పుడు ఇలా

సిల్క్ స్మిత తర్వాత ఎంతోమంది డ్యాన్సర్లు వచ్చారు.. అయినా ఎవ్వరూ కూడా సిల్క్ స్మిత బ్రాండ్ ఇమేజ్‌ను టచ్ చేయలేకపోయారు. ఇదంతా కూడా సిల్క్ స్మిత గురించి అందరికీ తెలిసిందే.  గతంలో డిస్కో శాంతి ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత గురించి పలు సంచలన విషయాలు చెప్పింది.‘సిల్క్ స్మిత చాలా కలుపుగోలుగా ఉంటుంది. ఆమెను నేను అక్కా అని పిలిచేదాన్ని. సిల్క్ స్మిత ఏ విషయాలు నా దగ్గర దాచేది కాదు. అప్పట్లో స్మిత లక్షల్లో పారితోషికం తీసుకునేది. రోజుకు లక్ష నుంచి రూ. 3 లక్షలు ఆమె రెమ్యునరేషన్‌గా తీసుకుంది. అంతే కాదు ఆమె ఓ అద్దె ఇంట్లో ఉండేది. ఆ ఇల్లు రెంటు నెలకు ఐదు లక్షలు. అలాగే మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది. దీని గురించి అడిగినప్పుడు అవకాశాల కోసం తిరిగినప్పుడు.. ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు నేనే డబ్బులపై పడుకుంటున్నాను అని చేప్పేది అని డిస్కో శాంతి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అలా ఎలా మిస్ అయ్యింది గురూ..! నాని ప్యారడైజ్ సినిమాను ఈ ముద్దుగుమ్మ వదులుకుందా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us