
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష సీజన్ 2 ఆడిషన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. చాలా మంది ఈ ఆడిషన్స్ లో పాల్గొంటున్నారు. ఈసారి అగ్నిపరీక్షకు కూడా బిందుమాధవి,నవదీప్, అభిజిత్ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇందుకు సంబందించిన ప్రోమోలు విడుదల చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. కాగా అగ్నిపరీక్షకు చాలా మంది కామనర్స్ హాజరవుతున్నారు. అలాగే కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ అయినా వారు కూడా అగ్నిపరీక్షకు హాజరవుతున్నారు. కాగా ఇటీవల విడుదలైన ప్రోమో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రోమోలో ఓ అమ్మాయి ఆడిషన్ కు రాగా ఆమెకు షోస్ తుడిచే టాస్క్ ఇచ్చారు. దానికి ఆమె ముందుగా నేను చేయను అని చెప్పినప్పటికీ ఆతర్వాత ఆమె షూస్ క్లిన్ చేసింది. అయినా కూడా జడ్జ్ లు ఆమెను సరిగ్గా చేయలేదు అని కామెంట్స్ చేశారు.
అలాగే అభిజిత్ ఆమె చెప్పులు తుడిచి షాక్ ఇచ్చాడు. ప్రపంచంలో ఏ పని చిన్నది కాదు అని చెప్తూ ఆమె కాలికి ఉన్న చెప్పును క్లిన్ చేశాడు. దాంతో అందరూ అభిజిత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ అమ్మాయి అందరి దృష్టి ఆకర్షించింది. చూడటానికి క్యూట్ గా ఉన్న ఆ అమ్మాయి ఎవరు అని నెటిజన్స్, ఆడియన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు, ఇన్ స్టా ఐడీ తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఆమె ఎవరంటే..
ఆమె పేరు షాలిని పటేల్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన క్యూట్ ఫోటోలు, వీడియోలతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. కాగా ఈ అమ్మడు తాజాగా బిగ్ బాస్ అగ్నిపరీక్షలా పాల్గొంది. తాజాగా విడుదలైన ప్రోమో తర్వాత ఈ అమ్మడి ఫాలోవర్స్ పెరిగిపోయారు. మొన్నటివరకు 2.8కే ఫాలోవర్స్ ఉండగా ఇప్పుడు ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. అలాగే ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ ముద్దుగుమ్మ అగ్నిపరీక్షలో సెలక్ట్ అయ్యి బిగ్ బాస్ 10 హౌస్ లోకి వెళ్తుందేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.