అప్పట్లో ఓ ఊపు ఊపేసింది.. కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. ఇప్పటికీ అదే క్రేజ్

సినిమాల రిజెల్ట్ ఎలా ఉన్నా సాంగ్స్ మాత్రం మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సాంగ్స్ మాత్రం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటుంటాయి. సినిమాల విజయానికి సంగీతం ఎంత ప్లస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సినిమాలు మ్యూజికల్ గా హిట్ అయ్యి ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేశాయి.

అప్పట్లో ఓ ఊపు ఊపేసింది.. కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. ఇప్పటికీ అదే క్రేజ్
Song

Updated on: Jul 05, 2026 | 10:51 AM

సినిమాల ప్రభావం జనల పై ఎలా ఉంటుందో సినిమా పాటల ప్రభావం కూడా ఆడియన్స్ మీద అంతే ఉంటుంది. సినిమా సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమాలో సాంగ్స్ మాత్రం ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తూ మెప్పిస్తున్నాయి. ఇక ఈమధ్య కాస్త తగ్గింది కానీ గతంలో సినిమాలో స్పెషల్ సాంగ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారు. స్పెషల్ సాంగ్స్ కూడా సినిమాలకు చాలా ప్లస్ అయ్యాయి. స్పెషల్ సాంగ్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాగే ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేయడానికి స్టార్ హీరోయిన్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. కాగా ఓ హీరోయిన్ స్పెషల్ సాంగ్ అప్పట్లో ఓ ఊపుఊపేసింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు.? ఆ స్పెషల్ సాంగ్ ఏంటో తెలుసా.?

అప్పట్లో ఆమె ఓ స్టార్ హీరోయిన్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది ఆమె.. ఆమె ఎవరో కాదు అందాల రాశి. హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది. హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇక మాస్ మహారాజా రవితేజ నటించిన వెంకీ సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్స్ చేసింది.

శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన వెంకీ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో ఈ సాంగ్ ఓ ఊపు ఊపేశాయి. వాటిలో రాశి నటించిన స్పెషల్ సాంగ్ ఒకటి. సిలకేమో సీకాకుళం అంటూ సాగే సాంగ్ లో రాశి అదరగొట్టేసింది. ఈ సాంగ్ , మ్యూజిక్ మాత్రమే కాదు రాశి డాన్స్ కూడా ఇరగదీసింది. ఇప్పటికీ మాస్ స్పెషల్ సాంగ్ చాలా మంది కుర్రాళ్ల ఫేవరెట్ సాంగ్. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us