Tollywood: పెళ్లైన హీరోలతో ఎఫైర్స్.. ఆ స్టార్ క్రికెటర్‏ను పిచ్చిగా ప్రేమించి.. ఇప్పుడు సినిమాలు వదిలేసి ఒంటరిగా..

ఒకప్పుడు భారతీయ సినీపరిశ్రమను ఓ ఊపు ఊపేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. అప్పట్లో ఆమె యూత్ కలల రాకుమారి. కానీ పెళ్లైన హీరోలను ప్రేమించింది.. చివరకు ఇప్పటికీ ఒంటరిగానే జీవితాన్ని గడిపేస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే..

Tollywood: పెళ్లైన హీరోలతో ఎఫైర్స్.. ఆ స్టార్ క్రికెటర్‏ను పిచ్చిగా ప్రేమించి.. ఇప్పుడు సినిమాలు వదిలేసి ఒంటరిగా..
Nagma

Updated on: Jun 05, 2025 | 9:00 AM

భారతీయ సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్. సోషల్ మీడియా లేని ఆ కాలంలోనే పాన్ ఇండియాను ఓ ఊపు ఉపేసింది. అందం, అభినయంతో వెండితెరపై సందడి చేసింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. పెళ్లైన హీరోలతో ప్రేమ, బ్రేకప్ అంటూ అప్పట్లోనిత్యం వార్తలలో నిలిచింది. ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తుంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ఆనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..? తనే ఒకప్పటి అందాల రాశి హీరోయిన్ నగ్మా.

దక్షిణాది సినిమాల్లో ఒకప్పుడు హీరోయిన్ నగ్మా అంటే చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్లోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పటికే మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్, రవీనా టాండన్ వంటి హీరోయిన్స్ టాప్ స్థానంలో దూసుకుపోతుండగా.. ఆనతికాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది నగ్మా. తెలుగులో స్టార్ హీరోస్ అందరితో కలిసి నటించిన నగ్మా.. ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే ఫేమస్ అయ్యింది. క్రికెటర్స్ నుంచి ఫిల్మ్ యాక్టర్స్ వరకు చాలా మంది పెళ్లైన స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపిందని అప్పట్లో తెగ ప్రచారాలు నడిచాయి. 1980లో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి బాఘీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నగ్మా.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. అదే సమయంలో ఇద్దరు భోజ్ పురి నటులను ప్రేమించిందనే టాక్ నడిచింది.

అలాగే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ప్రేమాయణం సాగించిందని.. అప్పటికే అతడికి పెళ్లి అయిపోయిందని సమాచారం. ఆ తర్వాత అప్పటి స్టార్ నటుడు శరత్ కుమార్ తో ప్రేమలో పడిందని.. అప్పటికే అతడికి సైతం పెళ్లి జరిగిందని టాక్. ఇక వీరిద్దరితోనూ రిలేషన్ షిప్ ఎక్కువ రోజులు కొనసాగలేదు. వీరే కాకుండా భోజ్ పురి నటుడు రవికిషన్, నటుడు మనోజ్ తివారీతోనూ నగ్మా పేరు ముడిపడి ఉంది. దాదాపు నలుగురు పెళ్లైన వ్యక్తులను ప్రేమించిన నగ్మా.. ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తుంది. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు.

Nagma

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..