
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా మెప్పించి ఆ పై హీరోలుగా హీరోయిన్స్ గా సినిమాలు చేస్తున్నారు. చాలా మంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు హీరోయిన్స్ గా మారి దూసుకుపోతున్నారు చాల మంది భామలు. అయితే కొంతమంది మాత్రం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్. బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతుంది. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎక్కువ సినిమాలు చేయలేదు.. కానీ హీరోయిన్ గా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె మరెవరో కాదు..
ఆ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళంలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ సంపాదించుకుంది. కోలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది ఆమె మరెవరో కాదు అందాల భామ ఐశ్వర్య రాజేష్. అయితే తమిళంలో వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు తెలుగులో ఎక్కువగా మారుమోగుతున్న పేరు ఐశ్వర్య రాజేశ్.
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకుంది ఐశ్వర్య రాజేశ్. ఇందులో భాగ్యం పాత్రలో అద్భుతమైన నటనతో తెలుగు అడియన్స్ మనసులు గెలుచుకుంది. అయితే ఐశ్వర్య రాజేశ్ చిన్నప్పుడే తెలుగులో ఓ సినిమా చేసిందని తెలుసా.. ? ఆ సినిమా మరేదో కాదు.. సీనియర్ హీరో, నటుడు రాజేంద్రప్రసాద్ నటించిన రాంబంటు చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. తెలుగమ్మాయే అయినా తమిళ నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్ సినిమాల్లో కనిపించింది. తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ మెప్పిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి