Rashmika Mandanna: రష్మిక చేతిపై ఉన్న ఈ రెండు టాటూల అర్థం ఏంటో తెలుసా ?.. తెలిస్తే మీరు ఫాలో అయిపోతారు..

|

Feb 10, 2024 | 12:14 PM

అటు తెలుగు, హిందీ, తమిళంలో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇప్పుడు పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఓవైపు చిత్రీకరణలలో పాల్గొంటూనే..మరోవైపు పలు యాడ్స్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోస్, ఫ్యామిలీ ఫోటోస్ పంచుకుంటూ అభిమానులతో టచ్‏లో ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది.

Rashmika Mandanna: రష్మిక చేతిపై ఉన్న ఈ రెండు టాటూల అర్థం ఏంటో తెలుసా ?.. తెలిస్తే మీరు ఫాలో అయిపోతారు..
Rashmika Mandanna
Follow us on

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా..ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా క్రేజ్ సంపాదించుకున్న ఈ తార… ఇటీవలే యానిమల్ మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ రెండు చిత్రాలు రష్మిక కెరీర్‏ను ఒక్కసారిగా మార్చేశాయి. దీంతో అటు తెలుగు, హిందీ, తమిళంలో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇప్పుడు పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఓవైపు చిత్రీకరణలలో పాల్గొంటూనే..మరోవైపు పలు యాడ్స్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోస్, ఫ్యామిలీ ఫోటోస్ పంచుకుంటూ అభిమానులతో టచ్‏లో ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది.

రష్మిక చేతిపై రెండు టాటూలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో రష్మిక మణికట్టు దగ్గర ఉన్న టాటూ కెమెరాకు కనిపించింది. గతంలో ఆ టాటూ మీనింగ్ కూడా చెప్పేసింది. ఆమె చేతిపై ‘ఇర్రీప్లేసబుల్ (Irreplaceable)’ అని కనిపిస్తుంది. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన టాటూ అర్థం బయటపెట్టింది.. ఇర్రీప్లేసబుల్ అంటే..” మనలోని ప్రతి ఒక్కరూ వారి వారి మార్గాల్లో ప్రత్యేకంగా ఉంటారు. మీ జీవితంలో ఎవరూ మిమ్మల్ని మరోక వ్యక్తితో భర్తీ చేయలేరు”.. అని అందుకే ఆ టాటూ అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ టాటూను తన కాలేజీ రోజుల్లోనే వేయించుకున్నట్లు తెలిపింది.

అయితే కుడి చేతి మధ్య వేలిపై మరో టాటూ ఉంటుంది. ఇంతకీ ఆ టాటూ ఏంటీ అనుకుంటున్నారా ?.. అది “ఇన్‏ఫినిటి”.. అంటే అనంతం అని అర్థం. ఈ పచ్చబొట్టు ఎప్పుడూ కనిపించదు..కానీ ఇటీవల రష్మిక షేర్ చేసిన సెల్ఫీలో చేతి వేలి పై ఉన్న టాటూ కనిపిస్తుంది. దీంతో ఆ టాటూ అర్థమేంటని నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.