Mahesh Babu: మహేష్‌తో ఉన్న ఈ చిన్నారి గుర్తుందా.? అతిథి సినిమాలో నటించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

|

Apr 17, 2023 | 7:13 AM

ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. 2007లో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయిన కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్ అమృతా రావు హీరోయిన్ గా నటించింది.

Mahesh Babu: మహేష్‌తో ఉన్న ఈ చిన్నారి గుర్తుందా.? అతిథి సినిమాలో నటించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
Mahesh Babu
Follow us on

సూపర్ మహేష్ బాబు నటించిన సూపర్ సస్టైలిష్ మూవీ అతిథి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకొలేకపోయింది. ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. 2007లో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయిన కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్ అమృతా రావు హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించిన చిన్నారి గుర్తుందా..? ఆ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

అతిథి సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించిన చిన్నారి పేరు కర్మన్ సంధు. ఈ చిన్నారి తన నటనతో ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అలరించింది ఈ అమ్మాయి. ఇక ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది.

తాజాగా కర్మన్ సంధు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతిథి సినిమా తర్వాత ఈ చిన్నారి మళ్లీ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ఇక ఈ ఆచిన్నారి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.