Simran: ఇండస్ట్రీకి మరో హీరో దొరికేశాడు మావ.. అందాల సిమ్రాన్ కొడుకుని చూశారా.?

హీరోయిన్ సిమ్రాన్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. అగ్ర హీరోలందరి సరసన నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారింది.

Simran: ఇండస్ట్రీకి మరో హీరో దొరికేశాడు మావ.. అందాల సిమ్రాన్ కొడుకుని చూశారా.?
Simran

Updated on: Aug 20, 2025 | 9:56 AM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సిమ్రాన్ ఒకరు. అందం అభినయం కలబోసినా సిమ్రాన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఈ అమ్మడు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోతుంది సిమ్రాన్. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సన్నజాజి తీగలాంటి నడుముతో.. ఆకట్టుకునే అభినయంతో అప్పటి కుర్రకారును కవ్వించింది ఈ వయ్యారి భామ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది అలాగే మహేష్ బాబుతోనూ నటించి మెప్పించింది సిమ్రాన్. మహేష్ హీరోగా నటించిన యువరాజు సినిమాలో నటించింది. అలాగే సిమ్రాన్ తమిళ్‌లోనూ దాదాపు అందరు స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించింది సిమ్రాన్. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది సిమ్రాన్.

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది సిమ్రాన్. సూర్య సరసన ఆమె నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే ఆతర్వాత ధ్రువనక్షతం అనే సినిమాలో నటించింది.

ఇవి కూడా చదవండి

ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు

విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది సిమ్రాన్. రీసెంట్ గా టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలోనూ నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే సిమ్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సిమ్రాన్ కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడు. సిమ్రాన్ కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరూ బాలీవుడ్ హీరోల్లాగా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.