ఇన్నాళ్లు ఏమైపోయిందో ఈ భామ..! బిగ్ బాస్ రతికా గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 9కు సిద్దమైంది. త్వరలోనే సీజన్ 9 ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ రతిక రోజ్.. ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఇన్నాళ్లు ఏమైపోయిందో ఈ భామ..! బిగ్ బాస్ రతికా గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే
Rathika Rose

Updated on: Sep 03, 2025 | 3:01 PM

బిగ్‏బాస్ రియాల్టీ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. ఎంతో మంది సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇఫులెన్సర్స్ బిగ్ బాస్ ద్వారా క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. బిగ్ బాస్ హౌస్ లో తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. అలాగే తన ఆటతో బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఆమె ప్రవర్తన కారణంగా ఎక్కువగా నెగిటివిటీని మూటగట్టుకుంది. ఈ షో కంటే ముందు పలు చిత్రాల్లో కథానాయికగా కనిపించింది. అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. కానీ బిగ్‏బాస్ తర్వాత మాత్రం ఆమెకు అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!

ఈ అమ్మడు మరెవరో కాదు.. రతికా రోజ్.. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి చదువులలో చురుగ్గా ఉండే రతిక.. హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. అదే సమయంలో నటనపై ఆసక్తితో బుల్లితెరపైకి అడుగుపెట్టింది. మోడల్ గా పనిచేసిన రతిక.. 2020లో జబర్దస్త్ ఫేమ్ షకలక శంకర్ నటించిన బొమ్మ అదిరింది సినిమాతో కథానాయికగా మారింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేదు.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే

ఆ తర్వాత బెల్లంకొండ గణేష్ నటించిన నేను స్టూడెంట్ సర్ చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత బిగ్‏బాస్ షోలోకి అడుగుపెట్టి తన పాపులారిటీ మరింత పెంచుకోవాలని అనుకుంది. కానీ ఊహించని విధంగా బిగ్‏బాస్ షోతో ఆమెకు ఎక్కువగా నెగిటివిటీ వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రతిక. తాజాగా ఈ అమ్మడు గ్లామర్ ఫోజులతో నెటిజన్లకు మతిపోగొడుతుంది. ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.