Puri Jagannath : మళ్లీ జన్మంటూ ఉంటే పూరి జగన్నాథ్‏లా పుట్టాలి.. టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్, ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా పూరీ సినిమాలంటే కుర్రాళ్లకు ప్రత్యేక అభిమానం ఉంటుంది. అలాగే ఆయన సినిమాల్లోని హీరోల పాత్రలకు యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. ఏకంగా ప్రభాస్ సైతం పూరీ రాసే డైలాగ్స్ అంటే ఇష్టమని ఇటీవల వెల్లడించారు.

Puri Jagannath : మళ్లీ జన్మంటూ ఉంటే పూరి జగన్నాథ్‏లా పుట్టాలి.. టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..
Puri Jagannadh

Updated on: Mar 02, 2026 | 2:10 PM

ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో ఆయన తన సినీ ప్రయాణం, సహచరులతో తనకున్న బలమైన అనుబంధాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పనితీరు, అలాగే దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మలతో తన స్నేహాన్ని వినాయక్ వివరించారు. దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ, “రత్తాలు రత్తాలు” పాటను ఆయన స్వయంగా రాశారని వినాయక్ వెల్లడించారు. తాను, తన బృందం తరచుగా దేవి శ్రీ ప్రసాద్‌ను పాటలు రాయమని కోరుతామని, ట్యూన్ ఇచ్చినప్పుడే చాలా వరకు సాహిత్యాన్ని కూడా అందిస్తారని తెలిపారు. దేవి శ్రీ ప్రసాద్‌ను గొప్ప రచయిత అని అన్నారు. దేవి శ్రీ ప్రసాద్ చాలా కష్టపడే వ్యక్తి, నిజాయితీపరుడు అని, సినిమా అంటే అతనికి ఎంతో మక్కువ, సంగీతం అంటే పిచ్చి అని అన్నారు.. ప్రతి సినిమాకి, చిన్న పనికి కూడా ప్రాణం పెట్టి పని చేస్తాడని, ఎంతో శక్తివంతంగా ఉంటాడని వినాయక్ ప్రశంసించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..

తన గుడ్ ఫ్రెండ్స్, కొలీగ్స్ అయిన ఎస్.ఎస్. రాజమౌళి, పూరి జగన్నాథ్‌లతో ఉన్న అనుబంధం గురించి వినాయక్ పంచుకున్నారు. రాజమౌళితో తనది ఎక్కువగా కుటుంబ గ్యాదరింగ్‌ల ద్వారా ఏర్పడిన అనుబంధం అని, ఆయన కుటుంబ సభ్యులందరికీ తాను అంటే ఎంతో ఇష్టం అని తెలిపారు. వినయ్ వచ్చాడని వారు ఆనందంగా ఫీల్ అవుతారని, అది తనకు చాలా నచ్చుతుందని చెప్పారు. రాజమౌళి చాలా కూల్‌గా, సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుతూ ఉంటారని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

పూరి జగన్నాథ్‌తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, వినాయక్ భావోద్వేగమైన వ్యాఖ్యలు చేశారు. లోగా ఫీల్ అయినప్పుడు లేదా మానసికంగా బాధపడినప్పుడు పూరి జగన్నాథ్‌ను తలుచుకోవాలనిపిస్తుందని అన్నారు. పూరి ఎటువంటి భారాన్ని, ఆందోళనలను కలిగి ఉండరని, చాలా బిందాస్‌గా ఉంటారని పేర్కొన్నారు. “మళ్లీ జన్మంటూ ఉంటే పూరిలా పుట్టాలి” అని ఆకాంక్షించారు. తాము తరచుగా సరదాగా కలుస్తూ ఉంటామని, పూరి ఎక్కడ ఉన్నా ఫోన్ చేసి పిలవగానే అన్ని పనులు పక్కన పెట్టి వస్తారని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

రామ్ గోపాల్ వర్మతో తన అనుబంధం గురించి కూడా వినాయక్ ప్రస్తావించారు. వర్మతో కలిసినప్పుడు ఆయన కంపెనీని ఎంజాయ్ చేస్తానని, శివ, హిందీ సినిమాలు వంటి ఆయన పాత చిత్రాల గురించి అడిగి తెలుసుకుంటానని, ఆయన చాలా సరదాగా చెప్తూ ఉంటారని అన్నారు. ఆయనతో కూర్చుంటే కాలం తెలియదని వినాయక్ పేర్కొన్నారు.

Vv Vinayak

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us