చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది.. అందరూ తప్పకుండా ఈ మూవీ చూడండి: శేఖర్ కమ్ముల

సాధారణంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన సినిమాల గురించి తప్పితే ఇతర సినిమాల గురించి పెద్దగా మాట్లాడరు. అయితే తాజాగా ఆయన ఓ తెలుగు సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. ఈ సినిమా ఎంతో ఆహ్లాదకరంగా అనిపించిందని, ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.

చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది.. అందరూ తప్పకుండా ఈ మూవీ చూడండి: శేఖర్ కమ్ముల
Director Shekar Kammula

Updated on: Nov 13, 2026 | 10:42 PM

యువన్‌కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, మనస్విని భాగ్యరాజ సమర్పణలో కార్తీక్ భాగ్యరాజ రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. ఈ చిత్రంలో సౌమిత్, శ్రేయసి సేన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్ర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని నవంబర్ 20న విడుదల చేయనున్నారు. ఇటీవల సంగీత దర్శకుడు కార్తీక్ బి కొడకండ్ల కంపోజ్ చేసిన ఆరె ఆరె పాట విడుదలై మంచి స్పందన లభించింది. అద్భుతమైన పాటలు, మంచి కథ, కథనం తో నిర్మించబడిన ఈ చిత్రాన్ని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల వీక్షించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘‘డియర్ ఆస్ట్రోనాట్’ సినిమా చూశాను. ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. చాలా రోజులకు మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ఈ చిత్రంలో పాప జర్నీ అందరికీ స్ఫూర్తిలా ఉంటుంది. డైరక్టర్ కార్తీక్ గొప్పగా తెరకెక్కించారు. మూవీలో పాప జర్నీలా డైరక్టర్ కార్తీక్ జర్నీ అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీ అందరికీ నచ్చుతుందని, ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుంది’ అని ఆకాంక్షించారు.

అంతకు ముందు సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి కూడా డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ .. ‘‘ఆస్ట్రోనాట్ అవ్వాలనే కోరిక ఉండటం, ఆ కోరిక చుట్టూ కథను తీయడం చాలా బాగుంది. కథానాయిక కూడా చక్కగా నటించింది. ఇది చాలా మంచి ప్రయోగం. ఎవరైనా సరే ఎంత పెద్ద కలలైనా కనొచ్చు, వాటిని సాకారం చేసుకోవచ్చు అనే గొప్ప సందేశాన్ని ఇచ్చేలా సినిమాని రూపొందించారు. టెక్నికల్లీ ఈ చిత్రం ఎంతో క్వాలిటీగా ఉందనిపిస్తోంది. ఇదొక గొప్ప సినిమాగా నిలుస్తుంది. ఈ మూవీ నవంబర్ 20న రిలీజ్ కాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని విషెస్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us