Mannara Chopra: మన్నారాకు ముద్దివ్వడంపై విమర్శలు.. దర్శకుడు రవికుమార్ రెస్పాన్స్ ఇదే..

|

Aug 31, 2023 | 4:17 PM

టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో నటి మన్నారా చోప్రాను డైరెక్టర్ ఎ.ఎస్‌. రవికుమార్‌ ముద్దుపెట్టుకోవడంతో నెట్టింట దుమారం చెలరేగింది. ఫొటోలకు పోజిచ్చే సమయంలో మన్నారా పక్కనే ఉన్న రవికుమార్‌ ఆమెపై చేయి వేసి.. బుగ్గపై కిస్ చేశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్‌మీడియాతో పాటు ఇంగ్లీష్ వెబ్‌సైట్స్‌లోనూ వైరల్‌గా మారాయి. బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రాకు మన్నారా కజిన్ అనే విషయం తెలిసిందే.

Mannara Chopra: మన్నారాకు ముద్దివ్వడంపై విమర్శలు.. దర్శకుడు రవికుమార్ రెస్పాన్స్ ఇదే..
Mannara Chopra - A.S. Ravi Kumar Chowdary
Follow us on

యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం వంటి సినిమాలతో అడపా దడపా హిట్లు అందుకుని.. ఇండస్ట్రీలో తన సత్తా చాటుకున్న దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి. తాజాగా ఈయన కాంట్రవర్సీకీ కేరాఫ్‌గా మారిపోయారు.  తన అప్ కమింగ్ మూవీ ‘తిరగబడరా సామి’ ప్రమోషన్లో.. నటి మన్నారా చోప్రాను.. ఆమె అనుమతి లేకుండా సడెన్‌గా ముద్దు పెట్టుకుని విమర్శల పాలైన ఈ డైరెక్టర్.. ఇప్పుడు తనపై వస్తున్న విమర్శలను తన పచ్చి మాటలతో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. తన ఈ రియాక్షన్‌తో.. ఇప్పటికే ఉన్న వివాదాన్ని కాస్త మరింత పెద్దదిగా చేస్తున్నారా అనే కామెంట్స్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నారు. తాజాగా తన ముద్దు వివాదంపై.. తనపై వచ్చిన విమర్శలపై మాట్లాడిన ఎఎస్ రవికుమార్.. తన స్టైల్లో మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు మన్నారా చోప్రాకు ముద్దు పెడితే తప్పేంటంటూ.. తన చర్యపై రాద్దాంతం చేస్తున్న వారిని నేరుగా ప్రశ్నించారు. తానేమైనా వేరే ఉద్దేశంతో ముద్దు పెట్టానా..? అని అందర్నీ రిటర్న్‌ ప్రశ్నించారు.

అంతేకాదు మన్నారాను తన కూతురిలా భావించి ఆప్యాయతతో ముద్దు పెట్టుకున్నా అంటూ.. తన ముద్దు వ్యవహారంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. “అయినా మన్నారాకు, నా కుటుంబ సభ్యులకు లేని నొప్పి మీకెందుకు” అంటూ ట్రోలర్స్ అండ్ నెటిజెన్స్ మీద కాస్త అసహనం వ్యక్తం చేశారు. ప్రేమానురాగాలతోనే ఆమెను ముద్దుపెట్టుకున్నానని, ఆమెను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం తనకు లేదని రవికుమార్ స్పష్టం చేశారు. తన సినిమాలో అద్భుతంగా నటించింది.. కాబట్టే.. మన్నారాను ముద్దు పెట్టుకున్నా అంటూ.. మరో స్టేట్మెంట్ ఇచ్చి.. తన ఇంటర్వ్యూను ముగించారు. ఇక తన రియాక్షన్‌తో.. తన మాటలతో.. నెట్టింట మరోసారి విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. ఏంటీ పచ్చి మాటలంటూ.. డైరెక్టర్‌పై కొందరు నెటిజెన్లు పంచ్‌లు పేల్చుతున్నారు.

రాజ్ తరుణ్, మన్నారా చోప్రా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘తిరగబడరా సామి’. ఒక ప్రచార కార్యక్రమంలో, మీడియా ఫోటోలు తీస్తున్నప్పుడు హీరోయిన్ మన్నారా చోప్రాను దర్శకుడు AS రవి కుమార్ చౌదరి ఆమె అనుమతి లేకుండా ముద్దుపెట్టుకున్నారు. ఈ సమయంలో ఆమె అసౌకర్యానికి, ఇబ్బంది గురైనట్లు వీడియోలో అర్థమైంది. అందుకే నెటిజన్లు డైరెక్టర్‌ను ఏకిపారేశారు. ఈ కల్చర్ కరెక్ట్ కాదని దర్శకుడిపై విమర్శలు గుప్పించారు.  కాగా బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రాకు మన్నారా కజిన్ అవుతుందన్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..