Dhurandhar 2: ధురంధర్ 2 పై రజినీకాంత్ ఆసక్తికర ట్వీట్.. డైరెక్టర్ ఆదిత్య ధర్ రియాక్షన్ ఇదే..

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతున్న సినిమా ధురంధర్ 2. డైరెక్టర్ ఆదిత్య ధర్, హీరో రణవీర్ సింగ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై రామ్ చరణ్, అల్లు అర్జు్న్, మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ఈ మూవీపై ఆసక్తికర ట్వీట్ చేశారు. అలాగే ఇప్పుడు డైరెక్టర్ ఆదిత్య ధర్ ఇచ్చిన రిప్లై సైతం వైరలవుతుంది.

Dhurandhar 2: ధురంధర్ 2 పై రజినీకాంత్ ఆసక్తికర ట్వీట్.. డైరెక్టర్ ఆదిత్య ధర్ రియాక్షన్ ఇదే..
Rajinikanth, Aditya Dhar

Updated on: Mar 24, 2026 | 6:02 PM

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా ధురంధర్ 2. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమాకు రోజు రోజుకీ విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ స్టార్ హీరోస్ మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీ్ట్స్ చేశారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ధురంధర్ 2 సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సినిమా దర్శకుడిని బాక్సాఫీస్ కా బాప్ అంటూ అభివర్ణిస్తూ..ఈ సినిమా ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన మూవీ అంటూ ట్వీట్ చేశారు. అయితే బాలీవుడ్ సినిమాపై రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ ప్రశంసించగా.. ధురంధర్ 2 మూవీ టీం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

తాజాగా రజినీ ట్వీట్ పై డైరెక్టర్ ఆదిత్య ధర్ ఎమోషనల్ అయ్యారు. తామంతా రజినీకాంత్ ను ఒక బెంచ్ మార్క్ గా చూస్తూ పెరిగామని.. వినోదానికి ఆయనే అసలైన నిర్వచమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ ఇప్పటికీ అదే స్టైల్, గ్రేస్ తో మ్యాజిక్ చేస్తున్నా సూపర్ స్టార్ నుంచి ప్రశంసలు అందుకోవడం తన జీవితంలోనే అతిపెద్ద సూపర్ స్టార్ మూమెంట్ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఆదిత్య ధర్. తమను పెద్ద కలలు కనేలా ప్రోత్సహించిన వ్యక్తి నుంచి ఈ అభినందనలు రావడం ఒక వరంలా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం రజినీ, ఆదిత్య ధర్ ట్వీట్స్ వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

ఇప్పుడు ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇందులో సారా అర్జున్ కథానాయికగా నటించింది. గతంలో విడుదలైన ధురంధర్ మొదటి భాగానికి సీక్వెల్ ఇది.

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

Follow Us