Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? వైరల్ వీడియో

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లోనూ ఎంతో స్టైలిష్ గా ఉంటారు. అతను ధరించే డ్రెస్ లు , వాచెస్, షూస్ కూడా నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ముఖ్యంగా సినిమా ఈవెంట్లకు వచ్చినప్పుడు ఎన్టీఆర్ పర్సనల్ థింగ్స్ బాగా హైలెట్ అవుతుంటాయి.

Jr.NTR: మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? వైరల్ వీడియో
Jr NTR
Follow us
Basha Shek

|

Updated on: Apr 06, 2025 | 2:06 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వార్ 2తో పాటు దేవర2, ప్రశాంత్ నీల్ సినిమాతో బిజి బిజీగా ఉంటున్నాడీ యంగ్ టైగర్. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న ఈ స్టార్ హీరో తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా సక్సెస్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. తన బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే రూ. 80 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో ‘మ్యాడ్ స్క్వేర్’  చిత్ర బృందం సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఎప్పటిలాగే తన అద్దిరిపోయే స్పీచ్ లో ఆడియెన్స్ ను ఉర్రూతలూగించాడు. ఈ నేపథ్యంలో మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్, ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. కాగా ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ గ్రీన్ కలర్ బాటిల్ ఉన్న ఓ డ్రింక్ తాగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో  జూనియర్ ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటి? ఆ బాటిల్ ధర ఎంత? స్పెషాలిటీ ఏంటి? అని నెటిజన్లు గూగుల్ లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ఈక్రమంలోనే ఆ డ్రింక్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఎన్టీఆర్ తాగింది పెరియర్ అనే కంపెనీకి చెందిన కార్బోనేటేడ్ మినరల్ వాటర్. ఇది జస్ట్ వాటర్ మాత్రమే. ఇది 330 ML బాటిల్స్ లో దొరుకుతుంది. ధర సుమారు 165 రూపాయలు. ఆన్ లైన్ లో ఆఫర్స్ ని బట్టి ఒక్కో బాటిల్ 145 నుంచి, బల్క్ ఆర్డర్ లో తీసుకుంటే తక్కువ ధరలో దొరుకుతాయి. ఇది సోడా టేస్ట్ లో ఉంటుందని సమాచారం. అమెజాన్, బిగ్ బాస్కెట్, స్విగ్గి.. లాంటి ఆన్ లైన్ యాప్స్ లోనూ ఈ కార్బోనేటేడ్ మినరల్ వాటర్ అందుబాటులో ఉంది. కాగా ఇది ఫ్రాన్స్ కి సంబంధించిన కంపెనీ. 1992 నుంచి ఇది అందుబాటులో ఉంది. ప్రస్తుతం 140 దేశాల్లో ఈ మినరల్ వాటర్ ని విక్రయిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా ఈవెంట్ లో ఎనర్జీ డ్రింక్ తో ఎన్టీఆర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హను సినిమాల్లో ఒక్కో పాట ఒక్కో డైమండ్.. చెవిలో అమృతం పోసిన్నట్టు.
హను సినిమాల్లో ఒక్కో పాట ఒక్కో డైమండ్.. చెవిలో అమృతం పోసిన్నట్టు.
బీఎస్‌ఎన్ఎల్‌ 5జీ నెట్‌వర్క్‌ మొదట ఆ నగరం నుంచే ప్రారంభం!
బీఎస్‌ఎన్ఎల్‌ 5జీ నెట్‌వర్క్‌ మొదట ఆ నగరం నుంచే ప్రారంభం!
కేవలం 10 సెకన్లలో ఈ ఫోటోలో పామును గుర్తిస్తే మీరు సూపర్ అంతే
కేవలం 10 సెకన్లలో ఈ ఫోటోలో పామును గుర్తిస్తే మీరు సూపర్ అంతే
ఎనిమిది సినిమాలు చేస్తే రెండే రెండు హిట్స్..
ఎనిమిది సినిమాలు చేస్తే రెండే రెండు హిట్స్..
కాప్య పాపకు అభిమాని లవ్ ప్రపోజల్ వైరల్!
కాప్య పాపకు అభిమాని లవ్ ప్రపోజల్ వైరల్!
తిరుగులేని బిజినెస్ ఇది..నెలకు రూ. 1 లక్ష తగ్గకుండా సంపాదించవచ్చు
తిరుగులేని బిజినెస్ ఇది..నెలకు రూ. 1 లక్ష తగ్గకుండా సంపాదించవచ్చు
అసలు BCCI మొక్కలు ఎక్కడ నాటుతోంది? పూర్తి వివరాలు..
అసలు BCCI మొక్కలు ఎక్కడ నాటుతోంది? పూర్తి వివరాలు..
నీటితో తేలియాడుతున్న అదో మాదిరి ఆకారం.. స్థానికులు వెళ్లి చూడగా
నీటితో తేలియాడుతున్న అదో మాదిరి ఆకారం.. స్థానికులు వెళ్లి చూడగా
ఆపిల్ అభిమానులకు శుభవార్త.. ఐఫోన్లపై ట్రంప్‌ కీలక నిర్ణయం..!
ఆపిల్ అభిమానులకు శుభవార్త.. ఐఫోన్లపై ట్రంప్‌ కీలక నిర్ణయం..!
చియా సీడ్స్​ని నానపెట్టకుండానే తింటే ఎంత డేంజరో తెలుసా..?జాగ్రత్త
చియా సీడ్స్​ని నానపెట్టకుండానే తింటే ఎంత డేంజరో తెలుసా..?జాగ్రత్త