Nag Ashwin: నాగ్ అశ్విన్ అన్ని సినిమాల్లో ఈ హీరోయిన్ నటించింది.. ఎవరో తెలుసా..?

|

Jun 24, 2024 | 4:39 PM

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా జూన్ 27 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీలో పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిశా పటాని నటిస్తుంది.

Nag Ashwin: నాగ్ అశ్విన్ అన్ని సినిమాల్లో ఈ హీరోయిన్ నటించింది.. ఎవరో తెలుసా..?
Nag Ashwin
Follow us on

నాగ్ అశ్విన్ పేరు ఇప్పుడు ఎక్కడ చూసిన మారుమ్రోగిపోతుంది. కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా జూన్ 27 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీలో పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిశా పటాని నటిస్తుంది. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ మూవీలో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే నాగి ఇప్పటివరకు ఒక హీరోయిన్ ను మాత్రం కంటిన్యూగా తన సినిమాల్లో తీసుకుంటున్నాడు. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

 ఇది కూడా చదవండి : బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఎదో మీకు తెలుసా.?

నాగ్ అశ్విన్ ఇప్పటివరకు మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతకు ముందు కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వచ్చిన ప్రతి సినిమాలో ఓ హీరోయిన్ మాత్రం కామన్ గా కనిపిస్తుంది. ఆ హీరో ఎవరో కాదు మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా నాయర్. మలయాళం, తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది ఈ బ్యూటీ. తెలుగులో ఈ అమ్మడు నటించిన సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం.

 ఇది కూడా చదవండి : Kiccha Sudeep: కిచ్చ సుదీప్ కూతుర్ని చూస్తే కెవ్వు కేక అనాల్సిందే.. ఎంత అందంగా ఉందో

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో నాని హీరోగా నటించగా.. విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాతో మాళవిక తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆతర్వాత మహానటి సినిమాలో చేసింది. మహానటి సినిమాలో అలమేలు జెమినీ గణేశన్ గా నటించింది మాళవిక. ఇక ఇప్పుడు మరోసారి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాలో నటిస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో ఆమె కనిపించింది. కల్కి సినిమాలోనూ మాళవిక కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. తెలుగులో మాళవిక అన్నీ మంచి శకునములే అనే సినిమా చేసింది. మరి కల్కి సినిమా తర్వాత ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరుగుతుందేమో చూడాలి.

మాళవికా నాయర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..