
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే ఈ పేరుకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా స్వయంకృషితో సక్సెస్ అయిన హీరోల్లో మెగాస్టార్ ముందుంటారు. విలన్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత హీరోగానూ విజయం సాధించారు. ఇప్పటివరకు సుమారు 157కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు మెగాస్టార్. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. ఇక చిరంజీవి అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని కోట్ల మంది అభిమానులు మెగాస్టార్ ను ఆరాధిస్తారు. ఈ అభిమానినికి కారణం చిరంజీవి సినిమాలు ఒక్కటే కారణం కాదు ఆయన చేస్తోన్న సేవా కార్యక్రమాలు. బ్లండ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అంటూ ఇప్పటికే ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు చిరంజీవి. అలాగే కరోనా టైమ్ లో ఆక్సిజన్ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు. అలాగే కష్టాల్లో ఉన్న ఎంతో మంది నటీనటులకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు చిరంజీవి. ఇక మనకు తెలియకుండా చిరంజీవి చేసిన గుప్తదానాలు ఎన్నో. ఇదిలా ఉంటే చిరంజీవి గొప్పతనం, ఆయన ఉదారత గురించి ఇటీవల ఒక టాలీవుడ్ యాక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ స్టార్టింగ్ లో రూమ్ రెంట్ కట్టేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే అప్పట్లోనే చిరంజీవి రూ.10000 సాయం చేశారని గుర్తు చేసుకున్నాడు. ఆ పదివేలతో తాను దాదాపు ఆరు నెలల పాటు హాయిగా బతికానని సదరు నటుడు చెప్పుకొచ్చాడు.
ఇంతకీ ఆ నటుడు ఎవరనుకుంటున్నారా? ప్రస్తుతం టాలీవుడ్ లో విలన్ గా, సహాయక నటుడిగా మెరుస్తోన్న శివాజీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసి మాస్టర్ సినిమా లో శివాజీ కీలకపాత్రలో నటించాడు. అయితే అప్పటికీ శివాజీ కెరీర్ లో పెద్దగా స్థిరపడలేదు. సినిమా సమయంలో తనకు వేసుకోవడానికి షూస్ కూడా లేవట. ఈ విషయాన్ని గమనించిన చిరంజీవి పక్కనే ఉన్న వేణుమాధవ్ ను పిలిచి విషయం అడిగారట. అప్పుడు అతను శివాజీ రూమ్ రెంట్ కట్టకుండా ఇబ్బంది పడుతున్నాడని చెప్పాడట. దాంతో మెగాస్టార్ ఎవరికి తెలియకుండా శివాజీని పిలిచి అతనికి అప్పట్లోనే 10000 రూపాయలు ఇచ్చారట. ఆ పదివేలతో దాదాపు ఆరు నెలలపాటు హాయిగా బతికానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శివాజీ. ఇక ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన శివాజీ ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా మెప్పిస్తున్నారు. సహాయక నటుడిగానూ రాణిస్తున్నారు.
మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ కి జన్మదిన శుభాకాంక్షలు ❤️#HBDChiranjeevi @KChiruTweets @MegaStaroffl pic.twitter.com/i2OgNm4Y4v
— Sivaji (@ActorSivaji) August 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి