AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదిత్య 369: బాలయ్య ప్లేస్‌లో కమల్ ఉండేవాడా..?

టాలీవుడ్‌ సినీ ఆణిముత్యాల్లో బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ ఒకటి. ఈ సినిమాకి.. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించగా.. శివలెంక క్రిష్ణ ప్రసాద్, ఎస్పీ బాలసుబ్రమణ్యం నిర్మాతలుగా వ్యవహరించారు. అప్పట్లో.. ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రచారంలో కూడా.. మెగాస్టార్ చిరు, విజయశాంతిలు పాల్గొన్నారు. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఇక.. శ్రీ కృష్ణ దేవరాయల వారిగా బాలయ్య ఆ పాత్రలో జీవించాడనే చెప్పాలి. కామెడీకి కామెడీ.. […]

ఆదిత్య 369: బాలయ్య ప్లేస్‌లో కమల్ ఉండేవాడా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 16, 2019 | 5:46 PM

Share

టాలీవుడ్‌ సినీ ఆణిముత్యాల్లో బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ ఒకటి. ఈ సినిమాకి.. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించగా.. శివలెంక క్రిష్ణ ప్రసాద్, ఎస్పీ బాలసుబ్రమణ్యం నిర్మాతలుగా వ్యవహరించారు. అప్పట్లో.. ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రచారంలో కూడా.. మెగాస్టార్ చిరు, విజయశాంతిలు పాల్గొన్నారు. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు.

ఇక.. శ్రీ కృష్ణ దేవరాయల వారిగా బాలయ్య ఆ పాత్రలో జీవించాడనే చెప్పాలి. కామెడీకి కామెడీ.. సస్పెన్స్‌కి సస్పెన్స్ అన్న మాదిరిగా ఈ సినిమా ఉంటుంది. అయితే.. మొదట ఈ సినిమాలో ఒక పాత్రకి.. కమల్ హాసన్‌ని తీసుకుందామనుకున్నారట. కానీ.. ఆయన ఈ సినిమాకి ఒప్పుకోలేదట. కారణం ఏంటంటే..! నిజానికి.. ఈ సినిమాలో బాలకృష్ణ నటించిన.. కృష్ణ కుమార్ పాత్రలో.. కమల్ హాసన్ నటించాల్సి ఉంది. కానీ.. అప్పటికే ఆయన ఒప్పుకున్న సినిమాల కారణంగా బిజీ షెడ్యూల్ ఏర్పడింది. దీంతో.. రెండు పాత్రలను బాలకృష్ణనే చేయాల్సి వచ్చింది. కానీ.. ఇద్దరూ కలిసి చేసి ఉంటే సినిమా ఇంకెంత అద్భుతంగా ఉండేదో..!

టైం మిషన్ కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది ఈ సినిమా. దీంతో.. ప్రేక్షకులు బాగా అట్రాక్ట్‌ అయి ఈ చిత్రాన్ని విజయవంతం చేశారు.

Follow Us
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీతో సహా క్యూ కట్టిన ఆర్సీబీ బ్యాటర్లు.. 3 వికెట్లు డౌన్
కోహ్లీతో సహా క్యూ కట్టిన ఆర్సీబీ బ్యాటర్లు.. 3 వికెట్లు డౌన్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్