Prabhas: ‘ధురంధర్’ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆదిత్య ధర్

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధిస్తోన్న ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2) సినిమాను ఇటీవలే వీక్షించారు ప్రభాస్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి అల్లు సినిమాస్ లో ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు డార్లింగ్.

Prabhas: ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆదిత్య ధర్
Aditya Dhar, Prabhas

Updated on: Apr 10, 2026 | 7:26 PM

ప్రభాస్ ను లెజెండ్ అని పిలుస్తూ, ఆయన స్పిరిట్ సినిమా థియేటర్స్ లో చూసేందుకు వేచి చూస్తున్నానంటూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు ధురంధర్ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధార్. దర్శకుడు సందీప్ వంగా ధురంధర్ ది రివేంజ్ సినిమాను అప్రిషియేట్ చేస్తూ చేసిన పోస్ట్ కు రిప్లై ఇచ్చిన ఆదిత్య ధార్…లెజెండ్ ప్రభాస్ కు నా ప్రేమను తెలియజేయండి అంటూ తన రిప్లై లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ నేపథ్యంలో ఆదిత్యధార్, ప్రభాస్ కాంబోలో ఓ క్రేజీ మూవీ వస్తే ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు మొదలయ్యాయి.
కాగా ధురంధర్ ది రివేంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటిదాకా ఈ చిత్రానికి 1680 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ వసూళ్లు దక్కాయి. ఈ సినిమా ప్రాపగండా మూవీ అంటూ బాలీవుడ్ లో కొందరు చేస్తున్న విమర్శలపై కౌంటర్ ఇస్తూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పోస్ట్ చేశారు. అలాంటి ప్రాపగండా మూవీస్ చేసే వాళ్లే నిజాయితీగా నిజాన్ని చెబుతూ రూపొందించే ధురంధర్ ది రివేంజ్ వంటి మూవీస్ పై విష ప్రచారం చేస్తారని సందీప్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ కు డైరెక్టర్ ఆదిత్యధార్ థ్యాంక్స్ చెబుతూ తను నమ్మిన కంటెంట్ ను తీసి తన అభిప్రాయాలపై బలంగా నిలబడే సందీప్ వంగా స్ఫూర్తిగా నిలుస్తారంటూ రిప్లై ఇచ్చారు.

కాగా ఆదిత్య ధర్ చెప్పిన స్పిరిట్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇందులో యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే విలక్ష నటుడు ప్రకాశ్ రాజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఓబెరాయ్ ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర చేస్తున్నాడు. భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్, టీ సిరీస్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో ఉన్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

ధురంధర్ 2 సినిమాపై సందీప్ రెడ్డి వంగా ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us