గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ గేమే ఛేంజర్. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో చరణ్ సరసన కియారా అద్వాణి కథానాయికగా నటిస్తుంది. అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అలాగే హీరోయిన్ అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేయనున్నారు.
ఈ క్రమంలో తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే చిత్రయూనిట్ అమెరికాలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. అలాగే వరుసగా సినిమా నుంచి అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రా మచ్చా మచ్చా, నా నా హైరానా పాటలను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి నాలుగో పాట దోప్ ను విడుదల చేశారు. ఇందులో చరణ్, కియారా డ్యాన్సింగ్ మూమెంట్స్ అదిరిపోయాయి. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను తమన్ సంగీత దర్శకత్వంలో తమన్, రోషిని, పృథ్వీ శ్రుతి రంజని పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది. మరీ ఈ దోప్ పాటను మీరు చూసేయ్యండి.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.