
బాలీవుడ్ ప్రముఖ జంట దీపికా పడుకోన్, రణవీర్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ స్టార్ కపుల్ సోషల్ మీడియాలో పంచుకున్న ఒక ప్రత్యేక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. దసరా పండుగ సందర్భంగా, రణవీర్, దీపికా తమ కుమార్తెను అందరికీ పరిచయం చేశారు. ఆమె ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 19న రాధాష్టమి పవిత్ర దినాన ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపిక, ఇప్పుడు విజయదశమి (దసరా) పండుగ సందర్భంగా ఆ పాప పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ స్టార్ జంట తమ రెండవ బిడ్డకు దేవి పడుకోన్ సింగ్ అని పేరు పెట్టారు. దసరా పండుగ సందర్భంగా ఐవరీ, గోల్డెన్ రంగు దుస్తులు ధరించిన దీపిక, రణ్‌వీర్‌ల అందమైన ఫ్యామిలీ ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు ‘ మా ప్రేమకు ప్రతీక… దేవి పడుకోన్ సింగ్’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటో వైరల్ అయింది. కాగా ఈ ఫోటోలో దీపిక, రణ్ వీర్ లతో పాటు వారి ఇద్దరి పిల్లలు ఒకే రంగు దుస్తులలో ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. అయితే ఈ ఫోటోలో కూడా దీపిక తన చిన్న కుమార్తె ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు దీపికా పదకొణె దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఇద్దరు కూతుళ్లు చాలా క్యూట్ గా ఉన్నారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
ఇంతకుముందు తమ మొదటి కుమార్తెకు దువా పడుకోన్ సింగ్ అని పేరు పెట్టిన ఈ జంట, ఇప్పుడు తమ రెండవ బిడ్డకు దేవి అని పేరు పెట్టారుజ భూమి పెడ్నేకర్, శర్వరి, సంజయ్ కపూర్, హుమా ఖురేషి తదితర బాలీవుడ్ ప్రముఖులు వారి పోస్ట్‌పై హార్ట్ ఎమోజీలను పంపి దీపికా-రణ్వీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. దీపికా పడుకోన్- రణవీర్ సింగ్ 2018 నవంబర్ 14 – 15 తేదీలలో ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2024 సెప్టెంబర్ 8న దువా అనే మొదటి కుమార్తె జన్మించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 19న రెండో కూతురు జన్మించింది.
ఇక సినిమాల విషయానికి వస్తే, తన రెండవ బిడ్డ పుట్టడం వల్ల షూటింగ్‌కు కొద్దికాలం విరామం తీసుకున్న నటుడు రణవీర్ సింగ్, అక్టోబర్ 27 నుండి ముంబైలో ప్రారంభమయ్యే ‘ప్రళయ’ సినిమా షూటింగ్‌కు తిరిగి రానున్నారు. నివేదికల ప్రకారం, ఆయన కొన్ని రోజుల పాటు షూటింగ్లో పాల్గొని, ఆ తర్వాత మళ్లీ విరామం తీసుకుంటారు. ఇక త్వరలోనే దీపిక కూడా మళ్లీ కెమెరా ముందుకు రానుందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.