Nikhil Siddharth: యంగ్ హీరో నిఖిల్‌‌‌ను సన్మానించిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్.. ఎందుకంటే

హీరోలు సినిమాలతోపాటు సమాజ సేవలోనూ ముందుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, విశాల్, సూర్య, అక్షయ్ కుమార్ ఇలా చాలా మంది..

Nikhil Siddharth: యంగ్ హీరో నిఖిల్‌‌‌ను సన్మానించిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్.. ఎందుకంటే
Nikhil

Updated on: Aug 14, 2021 | 12:23 PM

Nikhil Siddharth: హీరోలు సినిమాలతోపాటు సమాజ సేవలోనూ ముందుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, విశాల్, సూర్య, అక్షయ్ కుమార్ ఇలా చాలా మంది హీరోలు ప్రజలకు సేవలు చేస్తూ రియల్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక సోనూసూద్ అయితే ఏకంగా దేవుడుగా మారిపోయాడు. కరోనా కల్లోలంలో అల్లాడిపోతున్న ప్రజలకు అండగా నిలిచారు సోను. బడా హీరోలే కాదు కుర్ర హీరోలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా యంగ్ హీరో నిఖిల్‌‌‌ను సైబారాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ సన్మానించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో నిఖిల్ సేవలను గుర్తించిన సజ్జనార్ ఆయన్ను శాలువా కప్పి సన్మానించారు. ఈ విషయాన్ని నిఖిల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. కష్టసమయంలో ఎంతోమందికి సాయం చేసిన నిఖిల్.. చాలా మందికి స్పూర్తిగా నిలిచారని తెలిపారు సజ్జనార్.

సెకండ్ వేవ్ సమయంలో చేసిన పనులు, ఫ్రంట్ లైన్ కొవిడ్ పోలీస్ వారియర్లను కలవడం వంటి పనులకు గుర్తింపుగా సజ్జనార్ సార్ సత్కరించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని నిఖిల్ పేర్కొన్నాడు. హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో నిఖిల్ ఇంతకుముందు పోలీస్ శాఖకు తనవంతు సాయం అందించిన సంగతి తెలిసిందే. ఇక నిఖిల్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ’18 పేజెస్’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అలాగే త్వరలో కార్తికేయ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఆన్ లైన్‌‌‌‌లో చక్కర్లు కొడుతున్న నటి ప్రైవేట్‌ వీడియో.. దయచేసి వీడియోను తీసివేయండి అంటూ ఆవేదన

Vishwak Sen: ఆ మాటకు ఇంకా కట్టుబడే ఉన్నాను.. సినిమాకు ప్రమోషన్స్‌ కూడా అవసరం లేదంటున్నారు. విశ్వక్‌ సేన్‌ వ్యాఖ్యలు.

ఈ బుజ్జాయి ఇప్పుడు టాలీవుడ్‌‌‌లో నెంబర్ వన్ హీరోయిన్.. గెస్ చేయడం కష్టమే.. కావాలంటే ట్రై చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us