Colors Swathi: సెకండ్ ఇన్నింగ్స్ లో దుకుడు పెంచిన చలాకీ పిల్ల.. వరుస సినిమాలతో బిజీగా కలర్స్ స్వాతి

|

Jul 01, 2021 | 12:20 PM

అందం..చలాకీతనం కలబోసిన ముద్దుగుమ్మ కలర్స్ స్వాతి. ఒకప్పుడు వరుసగా యంగ్ హీరోల సరసన నటించిన సూపర్ హిట్స్ అందుకున్న స్వాతి కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది.

Colors Swathi: సెకండ్ ఇన్నింగ్స్ లో దుకుడు పెంచిన చలాకీ పిల్ల.. వరుస సినిమాలతో బిజీగా కలర్స్ స్వాతి
Sawathi
Follow us on

Colors Swathi: అందం..చలాకీతనం కలబోసిన ముద్దుగుమ్మ కలర్స్ స్వాతి. ఒకప్పుడు వరుసగా యంగ్ హీరోల సరసన నటించి సూపర్ హిట్స్ అందుకున్న స్వాతి కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది.పెళ్లి తరవాత ఇండోనేషియాలో సెటిల్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ సినిమాల్లో రాణించాలని చూస్తుంది.గతంలో యంగ్ హీరో నిఖిల్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ స్వామిరారా, కార్తికేయ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిఖిల్ కార్తికేయ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో స్వాతి నటిస్తుందని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దాదాపు 4 ఏళ్ల తరువాత కలర్స్ స్వాతి తిరిగి టాలీవుడ్ కు వచ్చింది. ‘పంచతంత్రం’ అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.
పంచతంత్రం అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది స్వాతి. నూతన దర్శకుడు హర్ష పులిపాక ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కలర్స్ స్వాతితో పాటుగా బ్రహ్మానందం, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు మరో తెలుగు సినిమాలోనూ స్వాతి నటుస్తున్నట్టు తెలుస్తుంది. పెళ్లి తర్వాత కాస్త బొద్దుగా కనిపించిన స్వాతి.. సినిమాల కోసం మళ్ళీ స్లిమ్ గా మారింది. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో స్వాతి ఎలా రాణిస్తారో చూడాలి .

మరిన్ని ఇక్కడ చదవండి : 

National Doctor’s Day: సాయి పల్లవి.. అజ్మల్ అమీర్‏ సహా నిజ జీవితంలో డాక్టర్స్ అయిన స్టార్స్..

Ravi Babu: అడల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న రవిబాబు.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానున్న క్రష్

Ranveer Singh: రణ్‏వీర్ సింగ్ న్యూలుక్ ఫోటోషూట్ వైరల్… మీమ్స్‏తో ఆటడేసుకుంటున్న నెటిజన్లు..