ఎలా రా ఇలా.! వైరల్ వీడియో పై సంయుక్త రియాక్షన్.. ఇంతకూ ఆ ఫొటోలో ఉంది ఎవరు.?
2016 నుంచి మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి.
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న క్రేజీ హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె క్రేజీ హీరోయిన్ సంయుక్తమీనన్. తెలుగులో గోల్డెన్ బ్యూటీగా మంచి గుర్తింపు సంపాదించుకుంది సంయుక్తా మీనన్. ఇటీవలే ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. బాలకృష్ణతో అఖండ 2 సినిమాతో పాటు ఈ సంక్రాంతికి విడుదలైన నారి నారి నడుమమురారి సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా సంయుక్తకు ఓ వింత సంఘటన ఎదురైంది.
మాములుగా సెలబ్రెటీలకు వీరాభిమానులుంటారు. హీరోలకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఉంటారో హీరోయిన్స్ కు కూడా అదే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. హీరోయిన్ ఎక్కడ కనిపించినా వారిని నేరుగా చూడాలి, వారితో ఫోటోలు దిగాలని ఎగబడుతూ ఉంటారు. అలాగే కొందరు అభిమానులు తమ అభిమాన హీరోయిన్ ఫోటోలను డ్రా చేసి వారికి బహుకరిస్తుంటారు. అలాగే ఓ వ్యక్తి సంయుక్తమీనన్ కు ఓ గిఫ్ట్ ఇచ్చాడు. అయితే ఆ వ్యక్తి ఇచ్చిన గిఫ్ట్ సంయుక్త డ్రాయింగ్. కానీ ఆ ఫొటోలో ఉన్నది మాత్రం సంయుక్త కాదు. ఆ డ్రాయింగ్ చూసి సంయుక్త కూడా షాక్ అయ్యింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెట్టింట ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. దీని పై సంయుక్త స్పందిస్తూ.. అతని ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నా అని రాసుకొచ్చింది.
2016 నుంచి మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. దీంతో ఈ అమ్మడిని గోల్డెన్ బ్యూటీ అని అభిమానులు పిలుచుకుంటున్నారు. బాలకృష్ణతో అఖండ 2,శర్వానంద్ జోడిగా నారీ నారీ నడుమ మురారీ సినిమాలతో హిట్స్ అందుకుంది. ఇక ఇప్పుడు పూరీ, విజయ్ సేతుపతి కాంబో, నిఖిల్ జోడిగా స్వయంభు, లారెన్స్ బెంజ్, బెల్లంకొండ శ్రీనివాస్ తో హైందవ, హిందీలో మహారాణి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది సంయుక్త.